మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు కరోనా పాజిటివ్ రావడంతో ఆయనను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. రమేష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలోనే ఆయనకు కరోనా సోకింది. దాంతో కోర్టు ఆదేశాల మేరకు .. మంగళగిరిలోని ఎన్నారై ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతున్నారు. రెండు రోజుల కిందట.. ఆయనకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అచ్చెన్నాయుడు అవినీతికి పాల్పడ్డారనడానికి ప్రాథమిక ఆధారాలు లేవని.. హైకోర్టు వ్యాఖ్యానించింది. హైకోర్టు బెయిల్ ఇచ్చినా కరోనా కారణంగా ఆయన ఇంటికి వెళ్లలేని పరిస్థితి.
చివరికి ఆయనకు ఈ రోజు చేసిన టెస్టుల్లో కరోనా నెగెటివ్ రావడంతో.. ఇంటికెళ్లేందుకు మార్గం సుగమం అయింది. లాంఛనాలు పూర్తి చేసి..ఆయన ఇంటికెళ్లిపోయారు. రెండున్నర నెలల కిందట అచ్చెన్నాయుడుని ఈఎస్ఐ స్కాంలో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆయనకు బెయిల్ రాకుండా.. ఉండేందుకు మూడో నిందితుడ్ని ఇంత వరకూ అరెస్ట్ చేయలేదనే విమర్శలు కూడా వచ్చాయి. ఆయనను రాజకీయ కుట్రతోనే అరెస్ట్ చేశారని..టీడీపీ నేతలు కొంత కాలంగా ఆరోపణలు చేస్తూ వస్తున్నారు.
జగన్ అక్రమాస్తుల కేసులో… ఎర్రన్నాయుడు హైకోర్టులో ఇంప్లీడ్ అయ్యి విచారణకు ఆదేశించడంలో కీలకంగా వ్యవహరించారు. తాను జైలుకు వెళ్లడానికి ఎర్రన్నాయుడు కుటుంబం కూడా ఓ కారణం అనుకుని..జగన్మోహన్ రెడ్డి ఎలాగైనా.. అచ్చెన్నను కొన్ని రోజులు జైల్లో ఉంచాలన్న లక్ష్యంతోనే ఇలా చేశారని..టీడీపీ నేతలు అంటున్నారు. అచ్చెన్న అవినీతిపై ఏసీబీ అధారాలు చూపించకపోతే.. ఏసీబీ అధికారులు ఇబ్బందులు పడే అవకాశం ఉందంటున్నారు.