దుబాయ్‌లో బాల్కనీ లేని హోటల్ రూమ్ ఇచ్చారంటూ.. చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ప్లేయర్ సురేష్ రైనా వెనక్కి వచ్చేయడం కలకలం రేపుతోంది. మొదటగా రైనా వెనక్కి రావడానికి చాలా కారణాలు వినిపించాయి. ఆయన బంధువులపై దాడి జరిగిందని ఓ సారి.. పిల్లల కోసమని ఇంకో సారి చెప్పుకున్నారు. కానీ అసలు విషయం మాత్రం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దుబాయ్‌లో రైనా కోసం కేటాయించిన హోటల్రూమ్కి బాల్కనీ లేదట. దీంతో…ఆయన టీమ్ మేనేజ్మెంట్తో గొడవపడ్డారు.
ధోనీకి లగ్జరీ రూమ్.. బాల్కనీ ఉన్న రూమ్ కేటాయించడంతో తనకీ అలాంటి రూమే కావాలని పట్టుబట్టారట. అయితే.. సాధ్యం కాదని చెప్పడంతో.. రైనా ధోనీతో కూడా గొడవపడి… ఐపీఎల్ నుంచి ఆడకుండా వెనక్కి రావాలని నిర్ణయించుకున్నట్లుగా చెబుతున్నారు. రైనాకు ఆప్తమిత్రుడిగా భావించే ధోనీ కూడా… మందలించారని చెబుతున్నారు.ఈ ఘటన కలకలం రేపడంతో చెన్నై సూపర్ కింగ్స్ యజమాని శ్రీనివాసన్.. స్పందించారు. కొన్ని సార్లు విజయాలు నెత్తికెక్కుతాయని.. ఇష్టం లేకపోతే వెళ్లిపోవచ్చని నేరుగా చెప్పేశారు.
ఐపీఎల్ లో చెన్నై టీమ్‌కు ఆడకపోవడం వల్ల.. సురేష్ రైనా రూ. పదకొండు కోట్లు నష్టపోతారని అంచనా. ఇంత జరిగినా… సురేష్ రైనా మనసు మార్చుకుని మళ్లీ వస్తే.. ఓకే అని శ్రీనివాసన్ అంటున్నారు. ప్రస్తుతం చెన్నై టీం… కరోనా కష్టాల్లో ఉంది.ఓ వైపు కరోనా బారిన పడిన సిబ్బంది.. ఓ ప్లేయర్… ఉండగా.. మరో వైపు రైనా అలగాడు. దీంతో వారు ఇంకా ప్రాక్టీస్ కూడా చేసుకోకుడా క్వారంటైన్‌లోనే ఉంటున్నారు.