శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదంపై ఖచ్చితంగా కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేయంచాలన్న పట్టుదలతో కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఉన్నారు. ఏపీ ప్రభుత్వం ప్రమాదం విచారణను..సీఐడీకి అప్పగించింది. సీఐడీ విచారణ కూడా ప్రారంభించింది. అనూహ్యంగా అధికారికంగా సీఐడీకి ఆ కేసు బదిలీ కాలేదన్న ప్రచారం ప్రారంభమమయింది. సమాంతరంగా పోలీసులు కూడా విచారణ జరుపుతున్నారు. దీంతో గందరగోళం ఏర్పడింది. ఈ పరిణామాలన్నింటితో.. ముందు నుంచి…కుట్ర కోణంలోనే ఆరోపణలు చేస్తున్న రేవంత్ రెడ్డి .. సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్నారు.
ఈ సారి నేరుగా ప్రధానమంత్రికే లేఖ రాశారు. ప్రమాదంపై ప్రధానికి రేవంత్‌రెడ్డి ఫిర్యాదు సీబీఐతో పాటు సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీతో… శాఖాపరమైన విచారణకు అదేశించాలని లేఖలో కోరిన రేవంత్‌రెడ్డి కోరారు. శ్రీశైలం ప్రమాదం ఘటనలో క్రిమినల్ కోణం ఉందని, రూ.వందల కోట్ల నష్టం జరిగిందని.. విచారణతోనే నిజాలు బయటకు వస్తాయని రేవంత్‌రెడ్డి లేఖలో చెప్పుకొచ్చారు. విద్యుత్ సంస్థల ఎండీగా ఉన్న ప్రభాకర్‌రావుకు హయాంలో ఇచ్చిన టెండర్లు, విద్యుత్ కొనుగోళ్లపై విచారణ జరపాల్సి ఉందన్నారు. బయట ఎవరి దగ్గర నుంచి విద్యుత్ కొంటున్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.
రేవంత్ రెడ్డి ఆరోపణల వెనుక ఓ లాజిక్ ఎప్పుడూ ఉంటుంది. శ్రీశైలం ప్రమాదం ఘటనకు కారణం ఏమిటో ఇంత వరకూ స్పష్టత లేకపోవడం…. ప్రమాదాన్ని ప్రమాదంగానే భావించి లైట్ తీసుకుంటున్న సూచనలు కనిపిస్తూడటంతో..రేవంత్ …కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణకు ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ అనుకుంటే..విచారణ జరిపించడం పెద్ద విషయం కాదనే అభిప్రాయం రాజకీయవర్గాల్లో ఉంది.