సూపర్ హిట్ గీతాలకు కవర్ సాంగ్స్ చేయడం యువతరం హాబీగా మారుతోంది, తమ ప్రతిభా పాటవాల్ని బయట పెట్టడానికి వాళ్ల ముందున్న మార్గాల్లో ఇదొకటిగా భావిస్తున్నారు. అయితే ఈమధ్య సెలబ్రెటీలు కూడా.. కవర్ పాటలతో ఆకట్టుకోవడం మొదలెట్టారు. ఈ లిస్టులో లావణ్య త్రిపాఠీ చేరింది. మణిరత్నం `ముంబాయి` సినిమాలోని `కన్నానులే..` పాటకు లావణ్య త్రిపాఠి కవర్ సాంగ్ చేసింది. మొత్తం పాట కాకపోయినా,.. పల్లవి, చరణంతో.. కవర్ సాంగ్ పూర్తి చేసింది. మణిరత్నం క్లాసిక్ టేకింగ్, రెహమాన్.. సూపర్ హిట్ ట్యూన్, మనిషా కొయిరాలా.. గ్లామర్ – ఇవన్నీ కలబోసిన పాట అది. ఆ పాటపై ఇష్టాన్ని కవర్ సాంగ్ తో చూపించుకోగలిగింది లావణ్య. ఈ పాటలో లావణ్య తో పాటు తన స్నేహితురాలు ఉమన్ గుప్తా కూడా నర్తించింది.