తెలంగాణ రాష్ట్రంలో రైతులకు గుండె దైర్యం పెరిగింది. ప్రభుత్వం ఇస్తున్న మద్దతు.. చేస్తున్న సాయం… నిరంతరాయంగా దీర్ఘకాల సమస్యలకు పరిష్కారం చూపే దిశగా చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి వస్తూండటంతో… ఆత్మహత్య సంఖ్య తగ్గుతూ వస్తోంది. 2018తో పోలిస్తే.. 2019లో సగానికిపైగా రైతుల ఆత్మహత్యలు తగ్గాయి. 2018లో 908 మంది రైతులు ప్రాణం తీసుకునారు. 2019లో అది 499 మాత్రమే. అంటే నలభై ఐదు శాతం మేర తగ్గిపోయింది. రైతుల ఆత్మహత్యల తగ్గుదలలో తెలంగాణ రాష్ట్రం దేశంలో మొదటి స్థానంలో నిలిచింది. నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ ఈ వివరాలను తాజాగా ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌లో రైతుల ఆత్మహత్యలు భారీగా పెరగ్గా.. తెలంగాణ మాత్రం… సగానికిపైగా తగ్గిపోయాయి.
రైతుల ఆత్మహత్యలు… దేశంలో మరే రాష్ట్రంలోనూ నమోదు కానంత తక్కువగా తెలంగాణలో నమోదయ్యాయి. 2018లో మూడో స్థానంలో ఉండేది. ఇప్పుడు ఐదో స్థానానికి చేరింది. ప్రభుత్వం రైతు బంధు పథకం ప్రవేశ పెట్టి.. ఎకరానికి రూ.ఐదు వేలు.. ఏడాదికి రెండు సార్లు ఇస్తోంది. ఇది రైతులకు ఎంతో మేలు చేస్తోంది. అదే సమయంలో… సాగునీటి సౌకర్యం పెరిగింది. గతంలో ఎన్నడూలేనంత పంట పడుతోంది. ఉపాధి లేక వలసపోయిన వారు కూడా.. నీరు అందుతూండటంతో.. సొంత గ్రామాలకు వచ్చి వ్యవసాయం చేసుకుంటున్నారు. పండిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు.. ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఏదైనా సమస్య వస్తే ప్రభుత్వమే కొనుగోలు చేస్తోంది.
రైతుల ఆత్మహత్యల శాతం తగ్గుదలతో తెలంగాణ మొదటి స్థానంలో ఉంటే.. పెరుగుదలో మాత్రం ఆంధ్రప్రదేశ్ టాప్ త్రీలో నిలిచింది. మొదటి స్థానంలో హర్యానా, అస్సాం ఉన్నాయి. మూడో స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలిచింది. కౌలు రైతుల్లోనూ ఆంధ్రప్రదేశ్‌లోనూ ఎక్కువమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ అంశంలో రెండో స్థానంలో ఏపీ నిలిచింది. అంతకు ముందు తగ్గుతూ వచ్చిన ఆత్మహత్యలు.. గత ఏడాది కాలంలో పెరిగిపోవడం.. ఆంధ్రప్రదేశ్‌కు.., ఇబ్బందికరం అయితే… రైతు ఆత్మహత్యలు లేని సమాజంవైపు కదలడం.. తెలంగాణకు ప్లస్ పాయింట్ అవుతోంది.