పవన్ కల్యాణ్ చేతిలో సినిమాలే సినిమాలు. వకీల్ సాబ్ పూర్తవ్వగానే, క్రిష్ సినిమా మొదలైపోతుంది. ఆ తరవాత.. హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి లైన్లో ఉన్నారు. ‘అయ్యప్పయుమ్ కోషియమ్’ రీమేక్ పైనా పవన్ దృష్టి పడింది. హరీష్ శంకర్ సినిమాకి సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్ నిన్ననే విడుదలైంది. ఆ పోస్టర్ లో కథ థీమ్‌ని చూచాయిగా పరిచయం చేశాడు హరీష్. సర్దార్ వల్లభాయ్ పటేల్, నేతాజీ ఫొటోల్ని చూస్తుంటే.. ఈ సినిమాలో పొలిటికల్ టచ్ ఉండబోతోందన్న అనుమానాలు కలుగుతున్నాయి. `యువత రాజకీయాలు` అనే విషయంపై.. రాసుకున్న కథ అని తెలుస్తోంది.
మరోవైపు… సురేందర్‌రెడ్డి కథలోనూ.. పొలిటికల్ డ్రామా ఉండబోతోందని తెలుస్తోంది. ఇప్పటికే వక్కంతం వంశీ పూర్తి స్థాయిలో కథ సిద్ధం చేశాడని సమాచారం. దానికి కాస్త ఫినిషింగ్ టచ్ ఇస్తే సరిపోతుంది. చేతిలో ఉన్న సినిమాల్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి 2024 ఎన్నికలకు సన్నద్ధం కావాల్ననది పవన్ ఆలోచన. అందులో భాగంగా హరీష్, సురేందర్ రెడ్డి సినిమాలు పొలిటికల్ గానూ తనకు మైలేజీ ఇవ్వాలని పవన్ భావిస్తున్నాడు. మరి ఈ కథలో.. పొలిటికల్ డ్రామా ఎంతుందో? దాని వల్ల పవన్‌కి ఎంత మైలేజీ రానుందో తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాలి.