ఆంధ్రప్రదేశ్‌లో మెజార్టీ ఉద్యోగులకు జీతాలు అందాయి. కానీ పెన్షన్లు మాత్రం ఇంకా అందలేదు. కారణం .. నిధులు లేకపోవడమే. ఒకటో తేదీన మంగళవారం రావడంతో.. ఆర్బీఐలో బాండ్లను వేలం వేయడం ద్వారా రూ. మూడు వేల కోట్లను తీసుకొచ్చిన ప్రభుత్వం.. జీతాలు చెల్లించింది. కానీ పెన్షన్ల చెల్లింపు కోసం.. ఆ మెత్తం సరిపోలేదు. ఉద్యోగుల జీతాల కోసం దాదాపుగా రూ. నాలుగు వేల కోట్లు.. పెన్షన్ల కోసం.. రూ. పదిహేను వందల కోట్లు నెలకు అవసరం అవసరం అవుతాయి. ఉద్యోగల జీతాలకు సరిపెట్టినా.. పెన్షన్ల కోసం.. రూ. పదిహేను వందల కోట్లు ఎక్కడి నుంచి తేవాలా అని ఆర్థిక శాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
ప్రస్తుతం ప్రభుత్వం వద్ద నిధులు ప్రస్తుతం ప్రభుత్వం వద్ద లేవు. ఓవర్ డ్రాఫ్ట్‌కు వెళ్తే… ఆర్బీఐ రూ. పదిహేను వందల కోట్లు ఇస్తుంది. కానీ సీఎం జగన్ మాత్రం.. ఓవర్ డ్రాఫ్ట్ లాంటి అతి స్వల్ప సమయం ఉండే అప్పులపై ఆసక్తిగా లేరు. దీంతో… వేస్ అండ్ మీన్స్ కింద ఆర్బీఐ నుంచి సేకరించాలని ఆర్థిక శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ నిధులను సేకరించి శుక్రవారం తర్వాత పెన్షనర్లకు పెన్షన్లు అందించే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఒక వేళ ఏదైనా ఇబ్బంది వస్తే.. మంగళవారం మళ్లీ బాండ్ల వేలం వేసి… నిధులు సమీకరించి ఇచ్చే అవకాశం ఉంది.
కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షనర్లకు ప్రతీ నెలా టెన్షన్ తప్పడం లేదు. ఆలస్యంగా రావడమే కాదు… లాక్ డౌన్ పేరుతో రెండు నెలలు కోత విధించారు. ఆ తర్వాత పూర్తి స్థాయిలో ఇస్తున్నా.. సమయానికి రావడం లేదు. గత నెలలో 12వ తేదీ వరకు పెన్షన్లు ఇస్తూనే ఉన్నారు. ఈ సారి కూడా అలాంటి పరిస్థితే ఏర్పడింది. రిటైరైన వారికి పెన్షనే ఆధారంగా ఉంటుంది. అనేక సమస్యలు ఉంటాయి. తమ జీవితాంతం సర్వీస్ చేసిన వారికి ప్రభుత్వం ఇలా చేయడం కరెక్ట్ కాదన్న వాదన వినిపిస్తోంది.