ప్రతీరోజూ పండగే తరవాత.. మారుతి సినిమా ఏదీ పట్టాలెక్కలేదు. రామ్, రవితేజతో సంప్రదింపులు జరిగాయి. రవితేజతో దాదాపుగా సినిమా ఫిక్సయ్యింది కూడా. కానీ ఇప్పుడు అదే డైలామాలో పడింది. రవితేజతో సినిమా ముందుకు వెళ్లడం ఇప్పుడు డౌటే. అందుకే మారుతి మరో ఆప్షన్ వెదుక్కుంటున్నాడు. రవితేజ కాదంటే.. బెల్లంకొండ శ్రీనివాస్ తో సినిమా చేయాలని భావిస్తున్నాడట. ఇందుకు సంబంధించి బెల్లంకొండతో సిట్టింగులు కూడా మొదలయ్యాయని తెలుస్తోంది. మారుతి చెప్పిన కథ బెల్లంకొండకు నచ్చింది. కాకపోతే.. అక్టోబరు నుంచి డిసెంబరులోగా.. డేట్లు కావాలని అడుగుతున్నాడట. ఆ టైమ్ లో బెల్లంకొండ ఫుల్ బిజీ. కాల్షీట్లు సర్దుబాటు చేస్తే గానీ – మారుతితో సినిమా ముందుకు తీసుకెళ్లడం కష్టం. ఇప్పుడు ఆ విషయంలోనే తర్జన భర్జనలు జరుగుతున్నాయని తెలుస్తోంది. బెల్లంకొండ ఓకే అంటే.. వీరి కాంబినేషన్లో సినిమా అక్టోబరులోనే మొదలయ్యే అవకాశాలున్నాయి.