తెలంగాణ మంత్రి హరీష్ రావుకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఆయన కు స్వల్ప లక్షణాలు ఉండటంతో ముందు జాగ్రత్తగా టెస్టులు చేయించుకున్నారు. ఫలితం పాజిటివ్ రావడంతో.. ఆ విషయాన్ని సోషల్ మీడియాలో ప్రకటించారు. తనకు పాజిటివ్ వచ్చినందున..ఇటీవలి కాలంలో తనను కలసిన వారందరూ టెస్టులు చేయించుకోవాలని సూచించారు. హరీష్ రావుకు కరోనా సోకిన విషయం తెలిసిన వెంటనే…మరో మంత్రి కేటీఆర్ కూడా స్పందించారు. త్వరిగతిన కోలుకోవాలని ఆకాంక్షించారు. టీఆర్ఎస్ నేతలు.. ఎమ్మెల్యేలు కూడా… హరీష్ రావు కరోనా బారి నుంచి త్వరగా బయటపడాలని ఆకాంక్షించారు.
ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు… పెద్దగా ప్రజలతో సంబంధం లేదని పదవిలో కొనసాగుతున్నారు . అయితే ఆయన ఉమ్మడి మెదక్ జిల్లా రాజకీయాలను మాత్రం తేలికగా తీసుకోవడం లేదు. పదవి ఉన్నా లేకపోయినా..ఆయన జిల్లా మొత్తం రాజకీయాల్ని చక్కబెడుతున్నారు. అదే సమయంలో… కరోనా మహమ్మారి ప్రభావం చూపుతున్నప్పటి నుండి ….ప్రత్యేక శ్రద్ధ తీసుకుని కట్టడి చర్యలపై దృష్టి పెట్టారు. మొదట్లో కరోనా బాధితుల ఇళ్లకు వెళ్లి ధైర్యం చెప్పి వచ్చేవారు. ఎప్పుడూ జనంలో ఉండే హరీష్ రావు… తన వరకు జాగ్రత్తలు తీసుకునేవారు. అయితే.. ప్రస్తుతం.. ఎవరి ద్వారా సోకుతుందో తెలియని పరిస్థితులు ఏర్పడ్డాయి.
ప్రస్తుతానికి హరీష్ రావుకు స్వల్ప లక్షణాలే ఉన్నాయి. వైద్యుల సూచనల మేరకు…హోమ్ ఐసోలేషన్ లోనే ఉండి చికిత్స పొందుతున్నట్లుగా తెలుస్తోంది. మరింత అనారోగ్యం బారిన పడితే.. ఆస్పత్రిలో చేరవచ్చు. ప్రస్తుతం.. తెలంగాణలో కరోనా బారిన పడిన ఎమ్మెల్యేల సంఖ్య ఎక్కువగానే ఉంది. అయితే ఎవరికీ సీరియస్ కాలేదు. అందరూ త్వరగానే కోలుకున్నారు.