బిజినెస్ రిఫార్మ్ యాక్షన్ ప్లాన్-2019 ర్యాంకింగ్ లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. రెండో స్థానంలో యూపీ, మూడో స్థానంలో తెలంగాణ ఉన్నాయి. ర్యాంకింగ్స్‌ను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం విడుదల చేశారు. ఈ జాబితాలో మరోసారి ఏపీ అగ్రస్థానంలో నిలిచింది. 2017-18లో ఏపీ మొదటి స్థానంలో ఉంది.. ఇప్పుడు 2018-19లోనూ అగ్రస్థానంలో నిలిచింది. గతంలో రెండో స్థానంలో ఉన్న తెలంగాణ ఈసారి మూడో స్థానంలో నిలిచింది. 2017-18లో పన్నెండో స్థానంలో ఉన్న ఉత్తరప్రదేశ్ రెండో స్థానం సంపాదించుకుంది. అదే సమయంలో…రెండో స్థానంలో ఉన్న తెలంగాణ 2019కి వచ్చే సరికి ఒక స్థానాన్ని కోల్పోయింది. ఇక నాలుగో స్థానంలో మధ్యప్రదేశ్, ఐదో స్థానంలో ఝార్ఖండ్, ఆరో స్థానంలో ఛత్తీస్‌గఢ్‌లు నిలిచాయి.
వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళికలోని సంస్కరణల అమలు ఆధారంగా దేశంలోని 34 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ర్యాంకులు ప్రకటిస్తున్నారు. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని పారిశ్రామిక, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ వీటిని ఇస్తూ ఉంటుంది. వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక… బీఆర్ఏపీ 2019 కింద 76 సంస్కరణలపై 100 శాతం ప్రామాణికతతో ర్యాంకులను డీపీఐఐటీ కేటాయించారు తెలిపింది. అనుమతుల కోసం ఆన్లైన్ సింగిల్ విండో వ్యవస్థ, భూ రికార్డుల నిర్వహణ, కేంద్రీయ తనిఖీ విధానం, పన్నులు, కార్మిక నిబంధనలు, విద్యుత్ సౌకర్యాల కల్పన తదితర 12 అంశాల ప్రాతిపదికన ఈ ర్యాంకులు ఇచ్చారు.
2019 వరకూ వాటిని కొనసాగించడంతో ర్యాంకింగ్‌లో ముందు ఉంది. ఇప్పుడు కూడా.. కేంద్రం ప్రవేశ పెట్టిన సంస్కరణలను ఏపీ సర్కార్… పూర్తిగా అమలు చేస్తోంది. కేంద్రం… ప్రతీ ఏటా ఈజ్ ఆఫ్ డూయింగ్ బీజినెస్.. ఈవోడీబీ ర్యాంకుల్ని కూడా ప్రకటిస్తుంది. ఈ ర్యాంకులు త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. బిజినెస్ రిఫార్మ్ యాక్షన్ ప్లాన్ కన్నా.. ఈవోడీబీలో ఎక్కువ సంస్కరణలు అమలు చేయాల్సి ఉంటుంది.