దిగ్గజ గాయకుడు కరోనా బారీన పడి ఆసుపత్రిలో చేరడం, ఆ తరవాత ఆయన ఆరోగ్యం క్షీణించడం తెలిసిన విషయాలే. ఇప్పటికీ ఆయన్ని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కాకపోతే… ఇది వరకటికంటే ఆయన పరిస్థితి బాగా మెరుగైంది. ఇప్పుడు ఆయనకు కరోనా నెగిటీవ్ కూడా వచ్చింది. ముందస్తు జాగ్రత్తగా ఆయన్ని ఇంకా ఐసీయూలోనే ఉంచారు.
బాలు దినచర్య ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. సంగీతం ఎక్కువగా వింటున్నారు. బాలుకి క్రికెట్ అంటే చాలా ఇష్టం. వెస్టిండీస్‌లో జరుగుతున్న సీబీఎల్ 20 – 20 మ్యాచుల్ని ఆయన ఇంట్రెస్ట్ గా చూస్తున్నార్ట. టెన్నిస్ మ్యాచ్‌లనూ ఫాలో అవుతున్నార్ట. త్వరలో ఐపీఎల్ ప్రారంభం కానుంది. ఆ సిరీస్ కోసం బాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని తనయుడు ఎస్.పి.చరణ్ తెలిపారు. త్వరలోనే బాలుని ఐసీయూ నుంచి సాధారణ గదికి మార్చే అవకాశాలున్నాయి.