సులభతర వాణిజ్యంలో మొదటి ర్యాంక్ వచ్చిందని.. ఆంధ్రప్రదేశ్‌లో అధికార, ప్రతిపక్షాలు క్రెడిట్ కోసం గేమ్ ప్రారంభించాయి. తమ పదవీ కాలంలో చేసిన పనికి ప్రతిఫలం అని టీడీపీ నేతలు ప్రకటనలు చేసుకుంటున్నారు. కాదు తమ పనికే దక్కిని ప్రయోజనం అని.. జగన్మోహన్ రెడ్డి ప్రకటిస్తున్నారు. ఇక మంత్రుల సంగతి చెప్పనవసరం లేదు. అదే.. ఇలాంటి స్పందన.. తర్వాతి రోజే వచ్చిన మరో ర్యాంకుల గురించి లేదు. ఆ ర్యాంకులు వచ్చింది నిర్లక్ష్యరాస్యత విషయంలో. వీటి గురించి ఎవరూ ప్రస్తావించడం లేదు.
నిరక్ష్యరాస్యతో బీహార్ ఎదిగింది… ఏపీ దిగజారింది..!
ఒకప్పుడు దేశంలో అక్షరాస్యత ఎక్కువ ఎక్కడ ఉంటుంది అంటే.. కేరళలో అని చెబుతారు. అక్కడ దాదాపుగా ప్రతి ఒక్కరూ చదువుకున్నవారే ఉంటారు. అలాగే.. అతి తక్కువ మంది అక్షరాస్యులు ఉన్న రాష్ట్రం ఏది అని ప్రశ్నిస్తే.. చిన్న పిల్లలు కూడా బీహార్ అని చెబుతారు. ఎందుకంటే.. గతంలో ఆ పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఆ బీహార్ పరిస్థితికి ఏపీ దిగజారింది. బీహార్ ప్రజలు చదువుకుని అక్షరాస్యులు అవుతున్నారు కానీ.. ఏపీలో మాత్రం పరిస్థితులు మారడం లేదు. అక్షరాస్యతలో ఆఖరి స్థానానికి ఏపీ పడిపోయింది. కేరళలో 96.2 మంది అక్షరాస్యులు. దేశంలోనే కేరళ మొదటి స్థానంలో ఉంది. ఏపీలో అక్షరాస్యత శాతం 66.4 శాతం. ఇది చిట్టవవరి స్థానం. బీహార్ కూడా 70.9 శాతంతో మెరుగైన స్థానంలో ఉంది. జాతీయ సగటు 77.7శాతంతో పోలిస్తే.. ఏపీ దారుణమైన పరిస్థితుల్లో ఉందని అర్థం చేసుకోవచ్చు.
వేల కోట్ల నిధులు వెచ్చిస్తున్నా ఫలితాలు రావట్లేదెందుకు..?
ప్రభుత్వాలు.. ప్రజల్ని విద్యావంతుల్ని చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు చిత్తుశుద్ధి లోపంతో ఉంటున్నాయి. విద్యారంగానికి ఖర్చు పెట్టే మొత్తం… వారికి డబ్బుల రూపంలో చెల్లించేస్తే.. తమకు ఓటు బ్యాంక్‌గా మారిపోతుందని ఆలోచన చేస్తున్నారు కానీ.. వారికి విద్య నేర్పే ప్రయత్నాలు చేయడం లేదు. గత ప్రభుత్వం అయినా.. ఈ ప్రభుత్వం అయినా అదే చేస్తోంది. దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌కు.. ఓ క్రియాశీలకమైన రాష్ట్రంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. కానీ ఇప్పుడు నిరక్ష్య రాస్యుల రాష్ట్రంగా మారిపోతోంది. సాంకేతిక నిపుణులు మాత్రమే కాదు… దేశంలో అత్యున్నత పదవుల వరకూ వెళ్లవారిలో తెలుగువారు ఎక్కువే ఉంటారు. ప్రస్తుతం… విద్యావిధానంలో మార్పు చేసి..డబ్బులు పంచడం కాకుండా.. విద్యును పంచాల్సిన పరిస్థితి రాక ముందే ఓ తరం మారేసరికి… ఆంధ్రులెవరూ… ఇతర రంగాల్లో ప్రభావం చూపే పరిస్థితి ఉండకపోయే ప్రమాదం ఉంది.
ఈ వైఫల్యం క్రెడిట్‌ను ఎవరు తీసుకుంటారు..?
ఏదైనా ఓ మంచి జరిగినా.. కనిపించినా.. అది ప్రకృతి సిద్ధంగా వచ్చినా సరే.. తమ ఘనత అంటే.. తమ ఘనత అని.. అధికార, ప్రతిపక్ష పార్టీలు.. డబ్బా కొట్టుకోవడానికి సిద్ధమవుతున్నాయి. ఇప్పుడు.. అక్షరాస్యతలో వెనుకబడిపోవడానికి వైఫల్యం కూడా ఆ పార్టీలదే. అయితే.. ఈవిషయంపై ఆ రెండు పార్టీలు.. మాట్లాడటం లేదు. మాట్లాడాల్సిన పని వస్తే… మీ తప్పిదమంటే.. మీ తప్పిదమని వారు ఒకరిపై ఒకరు నిందలేసుకుంటారు. కానీ అది రాజకీయం వారికి ఉపయోగపడుతుదేమో కానీ రాష్ట్రానికి కాదు. ఇప్పటికైనా ప్రభుత్వాలు ఈ వైఫల్యాన్ని ఓ చాలెంజ్‌గా తీసుకుని… విద్య తీరు మార్చుకోవాలి. లేకపోతే.. రాబోయే తరాల్లో… ఆంధ్రులంటే..కనీస గౌరవం లేకుండా పోతుంది.