ఈ లాక్ డౌన్ వేళ… హీరోలంతా తమ లుక్కులపై రకరకాల ప్రయత్నాలు, ప్రయోగాలూ చేశారు. చేస్తున్నారు. వాటిలో…. అల్టిమేట్ అనదగ్గ లుక్ వచ్చేసింది. చిరంజీవి రూపంలో. ఎప్పుడూ లేనిది… చిరు గుండుతో దర్శనమిచ్చారు. దాంతో… ఆయన ఫ్యాన్స్ షాక్ తిన్నారు. చిరు ఏంటి? గుండేంటి? ఇది నిజమేనా, మార్ఫింగా? అని ఆశ్చర్యపోయారు. అది నిజం లుక్కే. చిరు.. తన సోషల్ మీడియాలో సైతం ఈ లుక్ ని అభిమానులతో పంచుకున్నారు. ఇది ఓ సినిమాకి సంబంధించిన ట్రైల్ లుక్ అని చిరు పీఆర్ స్పష్టం చేసింది. ఈమధ్య చిరు చాలా కథలు విన్నారు. అందులో భాగంగా.. చిరు మైండ్ లో రకరకాల కథలు, లుక్ లూ తిరుగుతున్నాయి. `ఆచార్య` షూటింగ్ కి ఇంకాస్త టైమ్ ఉండడంతో… చిరు ఈ లుక్ ట్రై చేశారు. చిరు – బాబి కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతోంది. కథా చర్చలూ జరిగాయి. బాబి ఇటీవల చిరుకి లైన్ కూడా వినిపించి లుక్ గురించి చెప్పినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే చిరు ఈ లుక్ ట్రై చేశారని సమాచారం. చిరు ఈ లుక్ తో దర్శనమిచ్చినా, లేకపోయినా… చిరుని ఇలాంటి కొత్త లుక్ లో చూడడం మాత్రం ఫ్యాన్స్కి థ్రిల్ ఇస్తోంది.