సీక్వెల్ హావా నడుస్తోంది. మరీ ముఖ్యంగా శంకర్ సినిమాలు సీక్వెల్ దారిన నడుస్తున్నాయి. రోబోకి సీక్వెల్ గా రోబో 2 తీశాడు శంకర్. ఇప్పుడు ‘భారతీయుడు 2’ వస్తోంది. మరోవైపు `జెంటిల్మెన్ 2`కి రంగం సిద్ధం అవుతోంది. ఈ సినిమా వచ్చి పాతికేళ్లు దాటేశాయి. ఇప్పుడు సీక్వెల్ తయారవుతోందని నిర్మాత కుంజుమోహన్ తెలిపారు. అయితే ఈ సీక్వెల్కి శంకర్ దర్శకత్వం వహించడం లేదు. అర్జున్ కథానాయకుడిగా నటించడమూ లేదు. శంకర్, అర్జున్ లేకుండానే `జెంటిల్మెన్ 2` రూపుదిద్దుకోబోతోంది. దక్షిణాదిన అగ్ర నటుడిగా కొనసాగుతున్న ఓ హీరోతో.. ఈ ప్రాజెక్టు పట్టాలెక్కే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అయితే ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్ర కోసం అర్జున్ని సంప్రదించే అవకాశం ఉంది. రాబిల్ హుడ్ లాంటి హీరో కథతో.. `జెంటిల్ మెన్` రూపుదిద్దుకుంది. ఆనాటి విద్యా వ్యవస్థ, ఫీజుల జులుంపై.. `జెంటిల్మెన్` పోరాడాడు. ఈసారి ఎలాంటి సామాజిక అంశంతో ఈ సినిమా రూపుదిద్దుకుంటుందో చూడాలి. శంకర్, అర్జున్ లు లేని `జెంటిల్మెన్` ఏ మేరకు ప్రేక్షకుల్ని మెప్పిస్తాడో..?