అమరావతి విషయంలో ప్రజాభిప్రాయసేకరణ జరపాలన్న డిమాండ్ విషయంలో… వైసీపీ ఏ మాత్రం ఆసక్తిగా లేదు. చివరికి తాము డిమాండ్ చేస్తున్న ఎంపీ రఘురామకృష్ణరాజు తాను రాజీనామాకు సిద్ధమని.. ఉపఎన్నికను అమరావతి విషయంలో రిఫరెండంగా తీసుకోవాలని విసిరిన సవాల్ కూడా స్వీకరించడానికి వైసీసీ ఏ మాత్రం సిద్ధంగా లేదు. మంత్రి బొత్స సత్యనారాయణ ప్రెస్మీట్లో విచిత్రంగా స్పందింగారు. ఎంపీ రఘురామకృష్ణరాజు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్తే వెళ్లనివ్వండి .. ఆయన రాజీనామాతో పార్టీకి ఏం సంబంధమని వ్యాఖ్యానించారు. ఆయన విసిరిన సవాల్ గురించి ఏ మాత్రం తెలియనట్లుగా బొత్స రెస్పాండ్ అయ్యారు.
గతంలో.. చంద్రబాబు కూడా.. గతంలో అమరావతి విషయంలో గతంలో వైసీపీ నేతలు మాట్లాడిన మాటలు.. అధికారం చేపట్టిన తర్వాత మాట్లాడిన మాటలు అన్నీ వీడియోలతో సహా ప్రదర్శించి ప్రజల్ని మోసం చేశారని… మూడు రాజధానులపై ప్రజాభిప్రాయం తెలుసుకోవడానికి రిఫరెండం పెట్టాలని డిమాండ్ చేశారు. అయితే వైసీపీ నేతలు మాత్రం.. తాము రాజీనామాలు చేయనే చేయబోమని.. చంద్రబాబే రాజీనామా చేయాలని ఎదురుదాడి చేశారు. ఇప్పుడు ఒక్క స్థానానికి ఉపఎన్నిక విషయంలోనూ వైసీపీ సానుకూలంగా లేదు.
ఓ వైపు .. మూడు రాజధానులకు ప్రజల మద్దతు లేదని జరుగుతున్న ప్రచారం… మరో వైపు ప్రజాప్రాయసేకరణకు.. ప్రభుత్వం సిద్దంగా లేకపోవడం.. వంటి అంశాలతో వైసీపీపై ఒత్తిడి పెరుగుతోంది. సొంత పార్టీ నేతల్లోనే అసంతృప్తి పెరుగుతోందని రఘురామకృష్ణరాజు తరహాలోనే మరికొంత మంది అమరావతికి మద్దతుగా గళం వినిపించే ప్రమాదం ఉందన్న ప్రచారం వైసీపీలో జరుగుతోంది.