తెలంగాణలో వరంగల్ అర్బన్ కలెక్టర్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఐఏఎస్ అధికారిణి అమ్రపాలి …చాలా కొద్ది సర్వీసుతోనే నేరుగా ప్రధానమంత్రి కార్యాలయంలో కీలక బాధ్యతల్లోకి వెళ్లిపోయారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆమెను ఏపీ క్యాడర్‌కు కేటాయించారు. కానీ ఆమె తెలంగాణలోనే పని చేశారు. మొదట టీఆర్ఎస్ పెద్దలకు ఇష్టమైన ఐఏఎస్ అధికారిగా గుర్తింపు పొందారు. కానీ కొన్ని వివాదాలు చుట్టుముట్టడంతో ఆమె కేటీఆర్ విశ్వాసాన్ని కోల్పోయారని చెబుతారు. రెండో సారి బీజేపీ అధికారంలోకి రావడంతో… అమ్రపాలి కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లిపోయారు. వెళ్లారు అనుకునే కంటే… కిషన్ రెడ్డి తీసుకెళ్లారు అనడం కరెక్ట్. కిషన్ రెడ్డికి కేంద్రమంత్రి పదవి దక్కిన తర్వాత ఓఎస్డీగా అమ్రపాలికి చాన్సిచ్చారు. అక్కడ తన విధి నిర్వహణలో నమ్మకం సాధించడంతో నేరుగా ప్రధానమంత్రి కార్యాలయానికే అపాయింట్ అయ్యారు.
2010 యూపీఎస్‌లో ఆలిండియా 39వ ర్యాంక్ సాధించిన అమ్రపాలి ప్రతిభావంతమైన అధికారిగా గుర్తింపు పొందారు. పదేళ్ల సర్వీసు పూర్తికాక ముందే నేరుగా పీఎంవోలో పోస్టింగ్ పొందగలిగారు. 2023 అక్టోబర్ 7 వరకు ఆమె ప్రధానమంత్రి కార్యాయం పదవిలో ఉంటారు. ఆమ్రపాలి గతంలో వికారాబాద్ సబ్ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్‌గా, వరంగల్ కలెక్టర్‌గా పని చేశారు. సాధారణంగా పీఎంవోలో ఉండాలంటే.. అత్యంత విధేయులుగా గుర్తింపు పొంది ఉండాలి. అక్కడ ఉండే అధికారులకు గురుతర బాధ్యతలు ఉంటాయి. రాష్ట్రాల వారీగా వారు వ్యవహారాలను పర్యవేక్షించాల్సి ఉంటుంది. ప్రస్తుతం అమ్రపాలి.. దక్షిణాది రాష్ట్రాలను పర్యవేక్షించే అవకాశం ఉంది.
ప్రధానమంత్రుగా ఎక్కువగా ఉత్తరాదివారే ఉంటూంటారు. ఆ కారణంగా ఢిల్లీలోని కీలక నియామకాలన్ని ఉత్తరాది క్యాడర్ అధికారులకే దక్కుతూ ఉంటాయి. ఆయా నేతలతో నేరుగా పరిచయాలు ఉండటం… ఢిల్లీలో పెద్ద పదవులు పొందిన నేతలతో గతంలో కలసి పని చేసి ఉండటం లాంటి కారణలతో పదవులన్నీ ఎక్కువగా వారికే లభిస్తూ ఉంటాయి. చాలా పరిమితంగా దక్షిణాది వారికి చాన్స్ దొరుకుతుంది. అయితే అమ్రపాలికి మాత్రం ఈ విషయంలో ఎలాంటి చిక్కులు లేకుండా అవకాశం దక్కింది.