ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉద్ధృతి ప్రభావం ఎంత తీవ్రంగా ఉందో.. ఆ పార్టీ ఎంపీలకు చేసిన టెస్టుల్లోనే బయటపడింది. పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యేందుకు అందరు ఎంపీలకు కరోనా టెస్టులు చేశారు. ఇందులో ముగ్గురు లోక్‌సభ ఎంపీలకు కరోనా పాజిటివ్‌గా తేలింది. రెండు రోజుల కిందటే… కాకినాడ ఎంపీ వంగాగీతకు పాజిటివ్‌గా తేలింది. దాంతో ఆమె ఢిల్లీకి వెళ్లలేదు. ఢిల్లీకి వెళ్లిన తర్వాత పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యే ముందు ఎంపీలు మరోసారి టెస్టులు చేయించుకున్నారు. అందులో చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, అరక ఎంపీ మాధవిలకు పాజిటివ్‌గా తేలింది. వారికి ఎలాంటి లక్షణాలు లేకపోవడంతో.. ఇన్ని రోజులు.. అందరితో కలిసి కార్యక్రమాలు నిర్వహించారు.
ఇప్పుడు తప్పని సరిగా పరీక్షలు నిర్వహించాల్సి రావడంతో వారికి పాజిటివ్‌గా బయటపడింది. వీరికి లక్షణాలు లేకపోవడంతో.. హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకోవాలని అధికారులు సూచించారు. 22 మంది ఎంపీల్లో ముగ్గురుకి సోకడం.. గతంలోనే కొంత మందికి పాజిటివ్‌గా రావడంతో.. వారెవరూ సమావేశాలకు హాజరు కావడం లేదు. తెలంగాణ ఎంపీలు ఎవరికీ.. కొత్తగా పాజిటివ్‌గా నిర్ధారణ కాలేదు. ఏపీలో కరోనా తీవ్రంగా వ్యాపిస్తోదని.. లక్షణాలు లేకపోయినప్పటికీ.. అది అందర్నీ అంటుకుంటోందని.. సీరో సర్వైలెన్స్ సర్వేలో కేంద్రం వెల్లడించింది.
ఇప్పుడు.. .టెస్టుల్లో బయటపడుతున్న లక్షణాలు లేని కరోనా పాజిటివ్ వ్యక్తులు అదే నిజమని నిరూపిస్తున్నారు. కరోనా కారణంగా పార్లమెంట్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుని సమావేశాలు నిర్వహిస్తున్నారు. టెస్టుల్లో నెగెటివ్ వచ్చినా… కరోనా లక్షణాలు ఉన్న వారు.. పెద్ద వయసు వారు పార్లమెంట్‌కు రావొద్దనే సూచనలు పంపారు. ఈ ప్రకారం.. పార్లమెంట్లో సభ్యుల హాజరు పరిమితంగా ఉంది. పైగా… రెండు షిప్టుల్లో ఓ షిప్టులో లోక్‌సభ.. మరో షిప్ట్‌లో రాజ్యసభ నిర్వహిస్తున్నారు.