వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తు విషయంలో సీబీఐ గుంభనంగా వ్యవహరిస్తోంది. గతంలో ఓ సారి విచారణ జరిపి.. ఆ వివరాలతో ఢిల్లీ వెళ్లిన సీబీఐ అధికారులు మూడు రోజుల కిందట.. రెండో దఫా విచారణ ప్రారంభించారు. ఈ సారి విచారణ ప్రారంభించిన తర్వాత అనూహ్యమైన ట్విస్ట్ ఇచ్చారు. పులివెందుల కోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ వివరాలేమిటన్నది బయటకు రాలేదు. రెండు, మూడు రోజుల్లో ఆ పిటిషన్ను తెరిచి కోర్టు విచారించే అవకాశం ఉంది. ఇప్పుడు సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ ఏమిటన్నదానిపైనే రకరకాల చర్చలు… జరుగుతున్నాయి.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో.. చాలా మంది ప్రముఖుల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ముఖ్యంగా వైఎస్ కుటుంబసభ్యుల పేర్లే అనుమానితుల జాబితాలో మొదటి వరుసలో ఉన్నాయి. వైఎస్ వివేకా కుమార్తె కూడా… అదే చెబుతున్నారు. ఆమె ఈ కేసు విషయంలో చాలా సీరియస్గా ఉన్నారు. పట్టుబట్టి సీబీఐ విచారణ సాధించడమే కాదు.. సీబీఐ అధికారులకు దగ్గరుండి అన్ని వివరాలు అందిస్తున్నారు. దీంతో కేసు కీలక మలుపులు తిరగడం ఖాయంగా కనిపిస్తోంది. అదే సమయంలో… సాక్ష్యాలు తుడిచేయడానికి ప్రయత్నించిన వారు… కేసును తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించిన వారే.. నేరానికి పాల్పడి ఉంటారనేది.. క్రైమ్ విచారణలో పోలీసులు ఫాలో అయ్యే మొదటి ఫార్ములా. ఈ ప్రకారం చూసినా పలువురు ప్రముఖులు ఇరుక్కోవడం ఖాయంగా కనిపిస్తోంది.
ప్రస్తుతం.. ఉన్న పరిస్థితుల కారణంగా.. వైఎస్ కుటుంబసభ్యుల్ని కానీ.. వివేకా హత్య కేసులో అనుమానితులైన వారిని కానీ పిలిపించి విచారించే అవకాశం ఉండదు. పోలీసు వ్యవస్థ నిర్వీర్యం అయిందని హైకోర్టు తరచూ వ్యాఖ్యలు చేస్తున్న సమయంలో… కడపకో.. పులివెందులకో.. మిగతా వారిని పిలిపించి ప్రశ్నించే అవకాశం ఉండదని.. అందు కోసం.. పిటిషన్ దాఖలు చేశారని కొంత మంది చెబుతున్నారు. మరికొంత మంది మాత్రం.. అరెస్టుల కోసమే పిటిషన్లు దాఖలు చేసినట్లుగా అనుమానిస్తున్నారు. మొత్తానికీ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ మాత్రం… ప్రస్తుతం చర్చనీయాశం అవుతోంది. ఆ పిటిషన్లో వివరాలు తెలియకపోవడంతో.. రాజకీయవర్గాల్లోనూ మరింత ఆసక్తి రేపుతోంది.