చిన్న సినిమాలన్నీ ఇప్పుడు ఓటీటీ వైపు చూస్తున్నాయి. ఆహా కూడా కొన్ని సినిమాల్ని కొనుగోలు చేసి, తన కంటెంట్ బ్యాంక్ పెంచుకుంటోంది. అందులో భాగంగా `కలర్‌ఫొటో` స్ట్రీమింగ్ హక్కుల్ని సొంతం చేసుకుంది అహా. ఇప్పుడు రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేసింది. అక్టోబరు 23న ఈ చిత్రాన్ని ఆహాలో విడుదల చేయబోతున్నారు. సుహాస్ చాందిని జంటగా నటించిన చిత్రమిది. సునీల్ ప్రతినాయక పాత్రలో కనిపించబోతున్నాడు. సాయి రాజేష్ కథ అందించిన ఈ చిత్రానికి సందీప్ రాజ్ దర్శకుడు. కీరవాణి తనయుడు కాలభైరవ సంగీతం అందించారు. కేవలం నెలరోజుల్లో షూటింగ్ పూర్తి చేశారు. దాదాపు 3 కోట్లకు (అన్ని హక్కులూ కలిపి) ఈ సినిమాని కొనుగోలు చేసినట్టు టాక్. బడ్జెట్ కి మించిన ఆదాయం ఓటీటీ ఆఫర్ ద్వారా తిరిగి వచ్చేసింది. ఇప్పటికే విడుదలైన టీజర్‌కి మంచి స్పందన వచ్చింది.