పార్లమెంట్లో న్యాయస్థానాలను టార్గెట్ చేసేందుకు వైసీపీ ఎంపీలు ఏ మాత్రం వెనుకడుగు వేయడం లేదు. హైకోర్టు ఇచ్చిన తీర్పులపై విజయసాయిరెడ్డి సందర్భం లేకుండానే ప్రసంగించారు. దీనిపై రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ అభ్యంతరం చెప్పినా ఆయన ఆపలేదు. ఆ తర్వాత బయట కూడా కోర్టులపై విజయసాయిరెడ్డితో పాటు మిధున్ రెడ్డి కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విస్మరించి న్యాయ వ్యవస్థ పక్షపాతంతో వ్యవహరిస్తోందని విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఏ జడ్జికి ఉద్దేశాలు ఆపాదించడం లేదని …న్యాయస్థానాలు మీడియా నోరు నొక్కుతున్నాయని విమర్శించారు. విజయసాయిరెడ్డి న్యాయవ్యవస్థపై కంట్రోల్ తప్పి పోవడానికి కారణం… దమ్మాలపాటి శ్రీనివాస్ విషయంలో ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ మీడియాలో, సోషల్ మీడియాలో రాకుండా ఆదేశాలివ్వడమే.
కోర్టులు పౌరుల ప్రాథమిక హక్కులను హరిస్తున్నాయని.. ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ధర్మాన్ని కాపాడాల్సినవారే పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని.. కేంద్రమే ఇందులో జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. న్యాయ వ్యవస్థలో కొందరి వల్ల ఈ పరిస్థితి వచ్చిందని. పార్లమెంట్ లోపల ఏం మాట్లాడటానికైనా తమకు అధికారం ఉంటుందని మిథున్ రెడ్డి చెప్పుకొచ్చారు. అయితే వైసీపీ నేతలకు వెంటనే టీడీపీ నేతలు కౌంటర్లు ిచ్చారు. మీడియా గొంతునొక్కారని వైసీపీ నేతలు అంటున్నారని.. వివేకా హత్య కేసులో విచారణ అంశాలు.. మీడియాలో రాకూడదని కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నది గుర్తు లేదా అని ప్రశ్నిస్తున్నారు.
జడ్జిలను కూడా బెదిరింపులకు గురిచేస్తున్నారని రాజధాని ప్రకటన తర్వాత ఆస్తులు కొన్నవారిపై.. అక్రమంగా కేసులు బనాయిస్తున్నారమని మండిపడ్డారు. కోర్టులను బ్లాక్మెయిల్ చేయాలనే ఉద్దేశ్యంతోనే.. జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని .. న్యాయమూర్తులను భయబ్రాంతులకు గురి చేసైనా.. తమ దారిలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని మరో ఎంపీ రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు. మొత్తానికి న్యాయవ్యవ్సథపై వైసీపీ వ్యవహరిస్తున్న తీరు…ఢిల్లీ పార్లమెంట్ ప్రాంగణంలోనే చర్చనీయాంశం అవుతోంది.