బాలీవుడ్ లో విజయవంతమైన `అంధాధూన్`ని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. నితిన్ హీరో. కాకపోతే.. అక్కడ టబు చేసిన పాత్ర ఇక్కడ ఎవరితో చేయించాలన్న విషయంలో చిత్రబృందం తర్జనభర్జనలు పడింది. నయనతార లాంటి స్టార్ హీరోయిన్లని సంప్రదించారు దర్శక నిర్మాతలు. టబునే తీసుకుందాం అనుకున్నా. శ్రియ పేరు కూడా గట్టిగా వినిపించింది. చివరికి.. తమన్నాకి ఫిక్సయ్యారు. ఈ విషయమై చిత్రబృందం అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది. టబు స్థానంలో… తమన్నాని ఫిక్స్ చేసింది. కథానాయికగా నభా నటేషా నటించనుంది. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తారు. సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మాతలు. “టబు పాత్రకు హిందీలో విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఆ పాత్రలో తమన్నా కనిపిస్తుంది. రాధికా ఆప్టే పోషించిన పాత్రలో నభా నటిస్తుంది. ప్రతీ పాత్రకూ ఈ కథలో ప్రాధాన్యం ఉంది“ అని చిత్రబృందం తెలిపింది.