థియేటర్‌లు మూతబడడంతో… ఓటీటీవైపు చూసిన మరో సినిమా `నిశ్శబ్దం`. భారీ బడ్జెట్ సినిమా కావడం, అనుష్క, మాధవన్ లాంటి స్టార్లు ఉండడంతో ఈ సినిమాపై జనాల ఫోకస్ పెరిగింది. గత్యంతరం లేని పరిస్థితిలో ఓటీటీలో వస్తోంది తప్ప, థియేటర్ రిలీజ్ కోసమే చివరి వరకూ పాకులాడింది. అయితే అక్టోబరు 2న ఈ సినిమా అమేజాన్ లో రాబోతోంది. ఇప్పుడు ట్రైలర్ విడుదల చేశారు.
ఇదో థ్రిల్లర్. ఓ హాంటెడ్ హౌస్‌లో.. ఓ పెయింటింగ్ కోసం అన్వేషిస్తూ ఓ జంట వస్తుంది.ఆ ఇంట్లో జరిగిన పరిణామాలేంటి? అన్నదే ఆ తదుపరి కథ. అనుష్క ఈ చిత్రంలో మాటలు రాని యువతి పాత్రలో కనిపించబోతోంది. ఆ ఇంట్లో జరిగిన పరిణామాలకు, అనూహ్య సంఘటనలకు తానే సాక్ష్యం. ఇన్వెస్టిగేషన్, హారర్, ధ్రిల్లర్.. ఇవన్నీ మేళవించిన కథ ఇది. అంజలి ఓ కీలక పాత్ర పోషిస్తోంది. షాట్స్ కట్ చేసిన విధానం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చూస్తే… ఓ మంచి థ్రిల్లర్ ని చూడబోతున్నామన్న ఫీలింగ్ వస్తోంది. తెలుగుతో పాటు మిగిలిన దక్షిణాది భాషల్లోనూ ఒకేసారి ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.