వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు పెడుతున్న వ్యవహారం ఆంధ్రప్రదేశ్లో దుమారం రేపుతోంది. ప్రభుత్వ నిర్ణయంపై రైతులు అసంతృప్తితో ఉన్నారు. ఇంకా ప్రక్రియ ప్రారంభం కాలేదు.. ఒక వేళ మీటర్లు పెట్టే ప్రక్రియ ప్రారంభమైతే..రైతులు ఎక్కడికక్కడ మీటర్లను ధ్వంసం చేస్తారన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఈ మేరకు రాజకీయ పార్టీలు ఇప్పటికే పిలుపునిచ్చాయి. అయితే.. సంస్కరణల కోసం… రైతులకు మెరుగైన విద్యుత్ ఇచ్చేందుకు మీటర్లు అని ప్రభుత్ం చెబుతోంది. కానీ.. అసలు విషయం మాత్రం.. ఎఫ్ఆర్బీఎం పరిమితులు సడలింపులు తీసుకుని మరింత ఎక్కువగా అప్పు తీసుకోవడానికన్న చర్చ అన్ని చోట్లా జరుగుతోంది.
అయితేపెద్ద మొత్తంలో అప్పు వస్తుందని ఏపీ సర్కార్ ఇలా చేయడం లేదు. కేవలం నాలుగంటే నాలుగు వేల కోట్లమే… రైతులకు మీటర్ల కష్టాన్ని ఏపీ సర్కార్ తెచ్చి పెడుతోందట. ఈ విషయాన్ని తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు బహిరంగాగానే చెప్పారు. తెలంగాణకు కేంద్రం రూ.2,500 కోట్ల నిధులు ఇచ్చి.. బోరుబావుల దగ్గర మీటర్లు పెట్టమని చెప్పిందని.. కానీ తాము తిప్పికొట్టామని చెప్పుకొచ్చారు. అదే ఏపీకి రూ.4 వేల కోట్లు ఇస్తామంటే జగన్ ఒప్పుకుని మీటర్లు పెట్టారన్నారు. తెలంగాణతో పోలిస్తే.. ఏపీ కాస్త పెద్ద రాష్ట్ర కాబట్టి… పదిహేను వందల కోట్లను ఎక్కువగా ఏపీకి కేంద్రం ఇస్తుందని అనుకోవచ్చు.
ఇప్పటికే.. తెలంగాణ ప్రభుత్వం మీటర్ల జోలికి వెళ్లడం లేదు…. ఏపీ సర్కార్ ఎందుకు వెళ్లాలన్న సందేహం ఏపీ రైతుల్లో వస్తోంది. జగన్ తీరును.. టీఆర్ఎస్ పక్కాగా ఉపయోగించుకుంటోంది. దుబ్బాక ఉపఎన్నికల అంశంలో బిజీగా ఉన్న హరీష్ రావు ఇదే అంశాన్ని అక్కడి రైతులకు పదే పదే చెబుతున్నారు. తాము మీటర్లు పెట్టబోమని … కేంద్రం ఇచ్చే నిధుల కోసం కక్కుర్తి పడి రైతుల్ని ఇబ్బంది పెట్టబోమని పరోక్షంగా చెబుతున్నారు.