అభివృద్ధి కోసం మూడు రాజధానుల నినాదాన్ని ఎత్తుకున్న వైసీపీ.. కేంద్ర సంస్థలన్నింటినీ ఒక్క చోటే పెట్టాలని ప్రతిపాదనలు పెడుతోంది. ఎంపీ విజయసాయిరెడ్డి … కేంద్రం నుంచి ఎపీకి పలు సంస్థలు ఇవ్వాలని ప్రతిపాదనలు పెడుతున్నారు.. అన్నింటికీ.. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖ అనువైనదని చెబుతున్నారు. రాజ్యసభలో ఓ బిల్లుపై జరిగిన చర్చలో.. ఆంధ్రప్రదేశ్‌లో సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ బెంచ్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌లో అంటే ఎక్కడ… కేంద్ర ప్రభుత్వ రికార్డుల్లో ఉన్న అమరావతిలో ఏర్పాటు చేస్తారని అనుకున్నారేమో కానీ వెంటనే… విశాఖ పేరును కూడా చెప్పారు.
క్యాట్ పూర్తిగా కేంద్ర ప్రభుత్వఉద్యోగులకు సంబంధించినంది. ఆలిండియా సర్వీసెస్ ఉద్యోగుల పిటిషన్లను విచారిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం 50 వేల మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పని చేస్తున్నారని .. అందులో 60 శాతం మంది విశాఖపట్నంలోనే ఉన్నారని.. అందుకే విశాఖలో క్యాట్ బెంచ్ పెట్టాలని విజయసాయిరెడ్డి కోరారు. స్టీల్ ప్లాంట్, షిప్ యార్డ్, కస్టమ్స్, పోర్టు, డ్రెడ్జింగ్ కార్పొరేషన్, రైల్వేస్, ఎయిర్పోర్ట్, హెచ్‌పీసీఎల్, ఎల్ఐసీ వంటి అనేక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు విశాఖలో ఉన్నాయని విజయసాయిరెడ్డి గుర్తు చేశారు. దీంతో పాటు.. ట్రిపుల్ ఐటీని కూడా విశాఖలోనే పెట్టాలని విజయసాయి రెడ్డి రాజ్యసభలో కోరారు.
ఇప్పటికే పెట్టిన ఐఐఎంకు మరిన్ని నిధులివ్వాలన్నారు. వైసీపీ ఎంపీలు….తమ అభివృద్ధి వికేంద్రీకరణ వ్యూహాన్ని అన్ని చోట్లా అమలు చేయడం లేదు. సందర్భం వచ్చినప్పుడు.. ఒకే ప్రాంతం కోసంమాట్లాడుతున్నారు. ఇతర ఎంపీలు తమతమ ప్రాంతాల కోసం మాట్లాడటం లేదు. అదే అన్ని చోట్లకు అభివృద్ధి అనే కాన్సెప్ట్ క్షేత్ర స్థాయిలో అమలు చేయడానికి వైసీపీ నేతలు చిత్తశుద్ధితో లేదన్న అభిప్రాయం వినిపించడానికి కారణం అవుతోంది.