చిత్రసీమ మళ్లీ షూటింగులతో కళకళలాడబోతోంది. అక్టోబరులో బడా చిత్రాలు సెట్స్‌పైకి వెళ్లబోతున్నాయి. అందులో `ఆచార్య` ఒకటి. చిరు – కొరటాల కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ో కీలక పాత్రలో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. అక్టోబరులోనే చరణ్ కూడా సెట్స్‌పైకి వెచ్చే ఛాన్సుంది. అందుకే ఈ సినిమా కోసం చరణ్‌పై ఫొటో షూట్ చేయబోతున్నార్ట. చరణ్ గెటప్‌ని ఫైనలైజ్ చేయడానికి ఈ ఫొటో షూట్ ని ఉపయోగించుకోబోతున్నారు. ఇప్పటికే చరణ్ ఎలాంటి గెటప్‌లో కనిపిస్తే బాగుంటుందో, కొరటాల ఊహించి, కొన్ని స్కెచ్‌లు తయారు చేయించాడట. అందులో ఒకదాన్ని ఫిక్స్ చేసి, ఆ గెటప్ కి తగినట్టుగా చరణ్ మారబోతున్నాడని తెలుస్తోంది. చరణ్ పాత్ర ఫ్లాష్ బ్యాక్‌లో రానుంది. చరణ్ పక్కన రష్మికని కథానాయికగా ఫిక్స్ చేసినట్టు సమాచారం. ఈ షెడ్యూల్ లోనే చిరు- చరణ్‌లతో పాటు చిరు – రష్మికలపై కొన్ని సన్నివేశాల్ని తెరకెక్కించబోతున్నారు.