టీవీ9 నుంచి రజనీకాంత్ నిష్క్రమించారు. తెలుగులో నెంబర్ వన్ చానల్‌గా ఉన్న టీవీ9లో కొద్దిరోజులుగా గ్రూపుల గలాటా సాగుతోంది.రజనీకాంత్, మురళీకృష్ణల మధ్య సిబ్బంది రెండు వర్గాలుగా విడిపోయారు. కొత్త యాజమాన్యం చేతుల్లోకి వచ్చిన తర్వాత.. మొత్తం చానల్ బాధ్యతలను రజనీకాంత్‌కు అప్పగించారు. తన శక్తి మేర.. రవిప్రకాష్ బ్రాండ్‌ను తొలగించి.. టీవీ9 స్థానాన్ని కాపాడటంలో రజనీకాంత్ ప్రయత్నించి సక్సెస్ అయ్యారు. కానీ చాలా కాలంగా టీవీ9 కొత్త యాజమాన్యం ఒక విభిన్నమైన వ్యూహాన్ని అమలు చేస్తూ వస్తోంది.
రవిప్రకాష్ టీం అనే పేరున్నవారు ఎంత లాయల్‌గా ఉన్నప్పటికీ.. సమయం చూసి వారిని బయటకు పంపేస్తున్నారు. ఆ పద్దతిలో కొద్ది రోజులుగా మురళీకృష్ణకు ఎలివేషన్ ఇస్తున్నారు. కొన్నాళ్ల కిందటి వరకూ… సీవోవోగా ఉన్న సింగారావు పెద్దగా పట్టించుకునేవారు కాదు. కానీ ఆయన ఇప్పుడు పూర్తిగా లెక్కలు మార్చే పనుల్లో ఉన్నారు. 10టీవీ నుంచి కొంత మందిని తీసుకొచ్చారు. మురళీకృష్ణకు ప్రాధాన్యం ఇవ్వడం ప్రారంభించారు. చివరికి రజనీకాంత్‌కు పొగ పెట్టేశారు. అప్పటికి రజనీకాంత్.. యాజమాన్య రాజకీయ ఆసక్తులను గమనించి దానికి తగ్గట్లుగా ..చానల్‌ను న్యూస్ స్ట్రాటజీ కొనసాగించారు. విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గలేదు.
దాంతో ఆయన బయటకు వెళ్లాల్సి వచ్చింది. అయితే ఈ ప్రక్షాళన ఆగదని.. టీవీ9లో పాత టీంలో ఒక్కరు కూడా ఉండకుండా బయటకు పంపేస్తారని.. మురళీకృష్ణకూ…ఇప్పుడు కేక్ వాక్ కాదని టీవీ9లోనే ప్రచారం జరుగుతోంది. మొత్తానికి టీవీ9 కొత్త యాజమాన్యం తీరు మరోసారి వార్తల్లోకి వస్తోంది.