బాలు మృతిని సినీ రంగం జీర్ణించుకోలేకపోతోంది. మరీ ముఖ్యంగా.. ఆయన సన్నిహితులు, స్నేహితులు, సాహితీకారులు. బాలుని ప్రేమగా `అన్నయ్యా` అని పిలుచుకునే సిరివెన్నెల మాత్రం బోరున విలపించారు. `తెలుగు సినిమా పాటల మాస్టారు లేడా` అంటూ కన్నీటిపర్యంతమయ్యారు. ఆయన వేదనని, వీడ్కోలునీ ఓ వీడియోలో అభిమానులతో పంచుకున్నారు సిరివెన్నెల.
”ఇది అకాల సూర్యాస్తమయం. చాలామంది గాయుకలు వస్తారు వెళ్తారు. వచ్చిన ప్రతి వారూ వెళ్తారు. నిజానికి కొందరు వస్తారు. వెళ్లరు. వాళ్లు వెళ్లారనుకుంటున్నరు రోజుని.. కాలం వాళ్ల పేరుతో కొత్తగా పుడుతుంది. ఈరోజు ఒంటిగంటకు కాలం మళ్లీ వారి పేరుతో పుట్టింది. అందరూ మాట్లాడుతున్నారు. కానీ.. అందరి గొంతూ మూగబోయింది.
సినిమా పాట పట్ల సమాజానికి పెద్ద ఆరాధ్యమైన భావన ఏదీ లేదు. అలాంటి సినిమా పాటకి ఒక అద్భుతమైన స్థాయిని తెచ్చిన గాయకుడు. తెలుగు సినిమా పాటకి ప్రాతినిథ్యం బాలు గారు. కేర్ టేకర్. పెద్ద దిక్కు. ఏ గాయకుడైనా కొంతకాలానికి గళం మూగబోతుంది.కానీ బాలు అలా కాదు. పాట పట్ల బాలుగారికి అక్కర, పూజ.. ఎనలేనివి. ఇవాళ ఒక్కసారి అందరూ ఒక్క క్షణం మౌనంగా ఆలోచిస్తే.. ప్రతీ ఇంటి ఇంటిలోనూ బాలు ఓ ముఖ్యమైన సభ్యుడు. బాలు గొంతు వినని రోజు.. వినని ఇళ్లు.. కనిపించవు. పాట పాడడానికి గొంతే కాదు.. సంస్కారం కూడా ఉండాలని నేర్పిన మహానుభావుడు. గత ఇరవై ఏళ్లుగా పాడుతా తీయగా.. స్వరాభిషేకం లాంటి కార్యక్రమాలతో విస్మరించలేని స్థానం సంపాదించుకున్నాడు. ఈ రోజు ఏమైనా వినగాలనా..? కొన్నాళ్ల వరకూ వినగలరా? వింటే బాలుగారు గుర్తుకు రారా..? సినిమా పాట లో ఉండే మాట తాలుకు, సాహిత్య స్థానం ఇవ్వడానికి సంకోచించే ఒకానొక పరిస్థితుల్లో. పాటలోని పాట పట్ల ప్రత్యేకించి మాట్లాడే వ్యక్తి ఎవరైనా ఉన్నారా? ఒక్క బాలు తప్ప. చాలామంది `ఈయన అతి చేస్తున్నారు` అన్నారు. కానీ… పాట ఆయన ఆవేదన.. సరస్వతిదేవికి ఆయన చేసిన పూజ అది. మరో పాతిక ఏళ్లు.. ఆయన చేయాల్సింది. ఇప్పుడు ఆ పెద్ద దిక్కు లేదు. ఆయన్ని అనుకరించాలన్న ఆలోచన కూడా ఎవరికీ లేదు. నలభై వేల మంది బాలు గార్లని ఆయన అందించారు. సినిమా అన్నది ఉన్నంత కాలం.. బాలు ఉంటారు.
సమాజానికి సంగీతాచార్చుడు ఎవరు? పాట వెనుక ఓ సంస్కారం ఉందని చెప్పే ఆచార్యుడు ఎవరు? 74 ఏళ్లకు వెళ్లిపోవాక్కర్లెద్దు. `గంగాతరుణం` గీతం పాడి వినిపించినప్పుడు.. కుర్చీలోంచి లోంచి.. కళ్లలో నీళ్లు పెట్టుకుంటూ.. `మీరు ఎన్నో వందల పాటలు రాయాలని,. నేను పాడాలని అనుకుంటున్నా` అన్న మాట సుబ్రహ్మణ్యస్వామి దీవెన లా అనిపించింది. నా పెద్ద దిక్కు. నా సాహిత్యం తాలుకు దన్ను. ఎవరు నా పాట పాడతారు? ఎవరు నా గురించి చెప్పుతారు..?
నా పట్ల ఎంత బెంగ ఉండేదో నాకు తెలుసు. తోడబుట్టిన వాళ్లకు కూడా అంత ప్రేమ ఉంటుందా? పాట పాడడం కళ మాత్రమే కాదు. తపన ఉండాలి. అలాంటి వ్యక్తి కి అనారోగ్యం ఏమిటి? ఆయన మూగబోవడం ఏమిటి? నాకు ఈ ఓదార్పు నాకు సరిపోవడం లేదు. బాలు వెళ్లే సమయం కాదిది. ఆయన ఉనికి ఇంకా భౌతికంగా ఉండాల్సింది. ఆయన ఎన్ని ఇళ్లలలో పాటల దీపాలు వెలిగించాడు? ఎంత మంది ఆడపిల్లల ఆహార్యాన్ని సరిదిద్దారు? ఎంతమంది గాయకుల్ని గాన సరస్వతి పూజారులుగా తయారు చేశారు? అన్నది నిరంతరం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం. ఆయన ఇచ్చిన సంస్కారం మనం మర్చిపోకూడదు. మన ఆత్మలు ఘోషిస్తున్న రోజు ఇది” అంటూ కన్నీరు పెట్టుకున్నారు సిరివనెన్నెల.