హైదరాబాద్ మరింత ఆకర్షణీయంగా అయింది. మంత్రి కేటీఆర్ తన ఆలోచనకు నిర్మాణ రూపమిచ్చారు. చకచకా పనులు పూర్తి చేసి.. అందుబాటులోకి తీసుకు వచ్చారు. అదే దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి. దూరం నుంచే చూస్తేనే మిరుమిట్లు గొలుపుతూ ఉండేలా దీన్ని రూపొందించారు. ఈ కేబుల్ బ్రిడ్జి.. దీన్ని అనుసంధానం చేస్తూ నిర్మించిన ఫ్లై ఓవర్‌ను కేటీఆర్ ప్రజావసరాల వినియోగం కోసం ప్రారంభించారు. ఈ తరహా వంతెనలు విదేశాల్లో.. మాత్రమే ఉంటాయి. సినిమా పాటల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కానీ తెలంగాణ సర్కార్ ఆ సొగసైన నిర్మాణాన్ని హైదరాబాద్‌లోనే చేసింది.
ఈ రహదారి టూరిజం ప్లస్ పాయింట్ కోసం నిర్మించలేదు. ట్రాఫిక్ చిక్కులకు గొప్ప పరిష్కారం ఈ వంతెన. ప్రతీ రోజూ.. కొన్ని వేల మంది వెళ్లే .. ప్రముఖ ఐటీ కంపెనీలున్న మార్గంలో ఇది నిర్మించారు. ఈ ఐకా నిక్ బ్రిడ్జి నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ తదితర ఐటీ సంస్థల ప్రాంతాలకు అనుసంధానంగా ఉంటుంది. మైండ్‌స్పేస్, గచ్చిబౌలి వైపు వెళ్లే వారికి 2 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. ఎల్ అండ్ టీ ఈ నిర్మాణం చేసింది. 184 కోట్లతో పూర్తి చేశారు. ఇప్పటికే ఇది హైదరాబాద్ హ్యాంగింగ్ బ్రిడ్జిగా, టూరిస్ట్ స్పాట్‌గానూ మారింది. బ్రిడ్జిపైన పాదచారుల సంఖ్య కూడా పెరిగింది.
ఈ బ్రిడ్జిపై ప్రత్యేకంగా ధీమ్ లైటింగ్ ఏర్పాటు చేశారు. కేబుళ్లలకు విద్యుత్ వెలుగులు ఉంాటాయి. స్వాతంత్ర్య దినోత్సవంతో పాటు వివిధ సందర్భాలను బట్టి దాదాపు 25 థీమ్‌లను ఖరారు చేశారు. ఆయా సందర్భాలను బట్టి లైటింగ్‌ను ప్రదర్శిస్తారు. దూరం నంచి చూసేవారికి లేజర్ షో చూసిన ఫీలింంగ్ కలుగుతుంది. ఆ బ్రిడ్జి పై నుంచి వెళ్లే వారికి.. విదేశాల్లో ఉన్నామన్న అనుభూతి కలుగుతుంది.