ఆంధ్రప్రదేశ్లో ఓ భిన్నమైన వాతావరణం ఉంది. బడుగు, బలహీనవర్గాల బలహీనతలను ఆసరా చేసుకుని పెద్ద ఎత్తున మత మార్పిళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మతం మార్చుకుని రిజర్వేషన్లు అనుభవిస్తూ ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన కొంత మంది వ్యవహారాలను వెలుగులోకి తీసుకు వస్తున్న లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ .. మరోసారి ఈ అంశంపై రాష్ట్రపతికి, కేంద్ర సామాజిక న్యాయశాఖకు ఫిర్యాదు చేసింది. ఏడాది కాలంలో ఆంధ్రప్రదేశ్లో జరిగిన మత మార్పిళ్లకు సంబంధించి.. పూర్తి సమాచారాన్ని లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ సంపాదించింది. క్రైస్తవ మతమార్పిళ్లు, ఎస్సీ రిజర్వేషన్ల దుర్వినియోగం, తప్పుదోవ పట్టించే జనాభా లెక్కలు మొదలైన అంశాలపై సమగ్ర నివేదికను రాష్ట్రపతి భవన్కు, సామాజిక న్యాయశాఖకు పంపించారు.
ప్రభుత్వం తేరుకుని ఈ వ్యవహారంపై సమగ్ర కసరత్తు చేసి, అక్రమ మతమార్పిళ్లు, రిజర్వేషన్ల దుర్వినియోగం అరికట్టేందుకు కోసం తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా అభ్యర్థిస్తూ, అందుకోసం ఒక నిజనిర్ధారణ కమిటీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పంపాల్సిందిగా ఫోరమ్ తమ నివేదికలో కోరింది. దీనిపై విచారణ జరపాల్సిందిగా.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిని … రాష్ట్రపతి ఆదేశించారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం పంపలేదని తెలుస్తోంది.
లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం.. కొన్ని కేస్ స్టడీలను కూడా తన ఫిర్యాదులో జత చేసింది. కృష్ణా జిల్లా రెడ్డిగూడెం మండలంలో ఉన్న గ్రామాల సంఖ్య 11. కానీ ప్రభుత్వ రెవెన్యూ రికార్డుల ప్రకారం ఉన్న చర్చిల సంఖ్య.సంఖ్య 68. సగటున గ్రామానికి 6 చర్చిలు ఉన్నాయన్నమాట. ఇదే మండలంలో మద్దిలపర్వ అనే గ్రామం ఉంది. అందులో రికార్డుల ప్రకారం.. ఒక్కరంటే.. ఒక్కరు కూడా క్రీస్టియన్ లేరు. కానీ.. ఆ గ్రామంలో పదకొండు చర్చిలు ఉన్నాయి. అంటే.. ఆ చర్చిలను నిర్వహిస్తున్నవారు, ఆ చర్చిలకు వెళ్తున్నవారు తమను తాము క్రైస్తవులుగా నమోదు చేసుకోలేదన్నమాట. ఇది ప్రభుత్వాలను మోసగించడమేనని లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం అంటోంది.
2011 జనాభా గణన అధికారిక లెక్కల ప్రకారం అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6.82 లక్షలుగా ఉన్న క్రైస్తవ జనాభా ఉంది. 1971 నుండి 2011 కాలంలో రాష్ట్రంలోని క్రైస్తవ జనాభా తగ్గుతూ వచ్చింది. దీనికి కారణం విద్య, ఉద్యోగం, ఉపాధి అంశాల్లో రిజర్వేషన్లు పొందే ఉద్దేశంతో క్రైస్తవంలోకి మారినప్పటికీ అధికారిక రికార్డుల్లో ఆ విషయాన్ని తెలియజేయకుండా దాచిపెడుతూ ప్రభుత్వ యంత్రాంగాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు. నిజం తెలిసినా అధికారులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికే మతం మార్చుకుని .. రిజర్వేషన్లను ఉపయోగించుకుంటూ.. పెద్ద ఎత్తున లాభపడుతున్న క్రైస్తవులు చాలా మంది ఉన్నారు. ఉండవల్లి శ్రీదేవి … మేకతోటి సుచరిత సలహా.. పలువురు ప్రముఖులు మతం మార్చుకున్నారు. కానీ రిజర్వేషన్ల ఫలాలు పొందుతున్నారు. నిజంగా రిజర్వేషన్లు పొందాల్సిన వారు అన్యాయమైపోతున్నారు. వీరికి న్యాయం చేయడానికి లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం పని చేస్తోంది.