థియేటర్ రిలీజ్ కోసం ఎదురు చూసీ చూసీ, చివరికి ఓటీటీకి ఫిక్సయిపోయిన సినిమాల్లో `ఒరేయ్ బుజ్జిగా` ఒకటి. రాజ్ తరుణ్, హెబ్బా పటేల్, మాళవిక నాయర్ నటించిన ఈ చిత్రానికి విజయ్ కుమార్ కొండా దర్శకుడు. అక్టోబరు 2న ఆహాలో స్ట్రీమింగ్ అవ్వనుంది. అయితే… సడన్ గా చిత్రబృందం నిర్ణయం మార్చుకుంది. అక్టోబరు 1నే ఈ సినిమాని విడుదల చేయాలని ఫిక్స్ అయ్యింది. అక్టోబరు 1 రాత్రి 6 గంటలకే ఈ సినిమాని చూడొచ్చు.
ఈ నిర్ణయం వెనుక ఓ కారణం ఉంది. అనుష్క `నిశ్శబ్దం` కూడా అక్టోబరు 2నే విడుదల అవుతోంది. రెండు సినిమాలూ ఒకే రోజు అయినప్పుడు అందరి కళ్లూ `నిశ్శబ్దం` సినిమాపై నే ఉంటాయి. ఎంత ఓటీటీ అయినా ప్రేక్షకుల మొదటి ఆప్షన్ అంటూ ఒకటి ఉంటుంది. అందుకే రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక.. ఒకరోజు ముందుగానే ఓటీటీలో విడుదల చేసేస్తున్నారు.