అందాల ముద్దుగుమ్మ అంజలి అనగానే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా గుర్తుకు వస్తుంది. సీత పాత్రలో ఆమె చూపించిన అభినయం తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది. అభినయం ప్రాధాన్యత సినిమాల్లో నటిస్తూ క్రేజ్ సంపాధిస్తున్న అంజలి మొన్నామధ్య లీడ్ రోల్ చేసిన గీతాంజలితో హిట్ అందుకుంది. ఇక ఆ సినిమా ఇచ్చిన స్పూర్తితో మరోసారి లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తుంది ఈ అమ్మడు.
పిల్లజమిందార్, సుకుమారుడు సినిమాలను దర్శకత్వం వహించిన అశోక్ దర్శకత్వంలో చిత్రంగాథ సినిమా చేస్తుంది అంజలి.. సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తి చేసుకున్న తరుణంలో దీనిలో అంజలి కూడా ఓ పాట పాడుతుందట. ప్రస్తుతం సినిమాలో నటిస్తున్న హీరోలే తమ సినిమాలో పాటలను పాడేయటం కామన్ అయ్యింది. అందుకే ఇప్పుడు వారి దారిలో అంజలి కూడా గొంతు సవరించుకుని పాట పాడేస్తుంది.
అంతేకాదు చిత్రాంగథలోని తను పాడిన పాట తనకు సింగర్ గా కూడా మంచి పేరు తెచ్చి పెడుతుందని అంటుంది. మరి అంజలి అంత బల్ల గుద్ది మరి చెబుతుందంటే ఆ సినిమాలో పాట కచ్చితంగా ప్రాధాన్యత ఉండే ఉంటుంది. అంజలి సింగర్ అవతారం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.