ఆంధ్రప్రదేశ్‌లో అక్రమ మద్యం రవాణాను రాజకీయ పార్టీల నేతలు సైడ్ బిజినెస్‌గా చేసుకున్నారు. గతంలో మచిలీపట్నం పార్లమెంట్‌కు పోటీ చేసిన బీజేపీ నేత రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడగా ఈ సారి వైసీపీ నేత దొరికిపోయారు. అధికార పదవిని అనుభవిస్తూ…. అధికారికంగా వచ్చిన కారులోనే మద్యం బాటిళ్లు తరలిస్తూ… దొరికిపోయారు. ఇంద్రకీలాద్రి దుర్గమ్మ గుడి పాలకమండలి సభ్యురాలిగా జగ్గయ్యపేటకు చెందిన చుక్కా వెంకట నాగ వరలక్ష్మి పదవి పొందారు. మహిళా కోటాలోపదవి పొందిన ఆమెకు.. ఆలయం తరపున వాహనం కూడా సమకూర్చారు.
వాహనం ఎదుట పాలక మండలి సభ్యురాలు అని పెద్ద బోర్డు పెట్టుకుని దర్జాగా..ఏపీకి,తెలంగాణ మధ్య తిరిగేస్తున్నారు. అసలే అధికార పార్టీ పైగా.. ఓ ప్రముఖ ఆలయానికి బోర్డు సభ్యురాలు కూడా ..అందుకే పలుకుబడిని ఉపయోగించుకుని చెకింగ్ లేకుండా వచ్చేసేవారు. అలా ఈ మధ్య కాలంలో ఆ కారులో ఎంత మద్యం తరలించారో కానీ పోలీసులకు అనుమానం వచ్చింది. తెలంగాణ నుంచి వచ్చిన తర్వాత సీతారాంపురంలోని ఓ అపార్ట్మెంట్లో పార్క్చేసిన కారును చెక్‌చేశారు. అందులో పెద్ద ఎత్తున మద్యం బాటిళ్లు దొరికాయి.
కేసు నమోదు చేసిన ఎస్ఈబీ అధికారులు ..డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. దుర్గగుడి పాలకమండలి సభ్యురాలి భర్తను కూడా అదుపులోకి తీసుకుంటామని చెబుతున్నారు. ఓ మంత్రికి స్నేహితుడిగా వెంకట నాగ వరలక్ష్మి భర్తను చెప్పుకుంటారు. ఆలయానికి సంంధించిన కారులో ఇలా దర్జాగా మద్యం స్మగ్లింగ్ చేయడం …అందర్నీ విస్మయపరుస్తోంది. ఆలయపవిత్రను సభ్యురాలు మంటగలిపారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.