`ప్రతిరోజూ పండగే` తరవాత మారుతి సినిమా ఎవరితో, ఎప్పుడు? అనే విషయాల్లో స్పష్టత వస్తోంది. రవితేజ – మారుతి కాంబో దాదాపుగా ఖాయమైపోయింది. డిసెంబరు నుంచి ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది. మారుతి ఇప్పటికే స్క్రిప్టుని రెడీ చేసేసుకున్నాడు. ఇందులో రవితేజ లాయర్ గా నటిస్తాడని విశ్వసనీయ వర్గాల టాక్. మారుతి బలం వినోదం. రవితేజ కూడా దాన్నే నమ్ముకుంటూ వస్తున్నాడు. ఈసారి ఎంటర్టైన్మెంట్ కి పెద్ద పీట వేశాడట. `జాలీ ఎల్ ఎల్ బీ` లా.. నవ్విస్తూ, ఆలోచింపజేసే కథ ఇదని తెలుస్తోంది. లాయర్ గా నటించడం రవితేజకీ ఇదే తొలిసారి. యూవీ, గీతా ఆర్ట్స్ 2 సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. ప్రస్తుతం కథానాయిక, ఇతర సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది. త్వరలోనే పూర్తి వివరాలు బయటకు వస్తాయి. మరోవైపు రవితేజ `క్రాక్` సినిమాతో బిజీగా ఉన్నాడు. తన చేతిలో మూడు నాలుగు ప్రాజెక్టులున్నాయి. అయితే ముందుగా మారుతి సినిమానే మొదలయ్యే ఛాన్సుంది.