టాలీవుడ్ మహా బిజీగా ఉన్న యువ హీరోల్లో నాగశౌర్య ఒకడు. తన చేతిలో ఇప్పుడు ఓ అరడజను సినిమాల వరకూ ఉన్నాయి. ఇప్పుడు మరోటి చేరింది. నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో నాగశౌర్య ఓ సినిమా చేయబోతున్నట్టు టాలీవుడ్ టాక్. `సినిమా చూపిస్తా మావ`, `నేను లోకల్`, `హలో గురు ప్రేమకోసమే` సినిమాలతో ఆకట్టుకున్నాడు నక్కిన. ఆ తరవాత వెంకటేష్ తో ఓ సినిమా చేద్దామనుకున్నాడు. అది కుదర్లేదు. ఆ తరవాత… రవితేజతో ఓ సినిమా ఓకే అయ్యింది. అయితే.. దాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లడానికి కొంచెం సమయం పట్టేట్టు వుంది. ఈలోగా.. నాగశౌర్య సినిమాని పూర్తి చేయాలని భావిస్తున్నాడు త్రినాథరావు.ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన కథా చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ కాంబో గురించిన అధికారిక ప్రకటన రానుంది.