టాలీవుడ్ లో షూటింగుల కళ మళ్లీ మొదలైంది. పెద్ద సినిమాలన్నీ వరుసగా పట్టాలెక్కుతున్నాయి. పవన్ కల్యాణ్ `వకీల్ సాబ్` కూడా మొదలైపోయింది. పవన్ లేని సన్నివేశాల్ని ప్రస్తుతం తెరకెక్కిస్తున్నారు. పవన్ సెట్లోకి అడుగుపెట్టడమే ఆలస్యం. ఇప్పుడు పవన్ కూడా `వకీల్ సాబ్`కి డేట్లు ఇచ్చేశాడు. ఈ నెల 26 నుంచి పవన్ సెట్లో అడుగుపెట్టబోతున్నాడట. ఈ సినిమా కోసం పవన్ మరో 20 రోజుల కాల్షీట్లు ఇచ్చాడు. ఈ 20 రోజుల్లో సినిమా పూర్తి చేసుకోవాల్సివుంది. డిసెంబరులోగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా అవ్వగొట్టి.. సంక్రాంతికి సినిమాని సిద్ధం చేయాలని దిల్ రాజు భావిస్తున్నాడు. పవన్ కి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ సీన్లు తీస్తే సరిపోతుంది. ఇందులో ఓ పాట కూడా ఉంది. 20 రోజులూ నాన్ స్టాప్ గా షూటింగ్ జరగబోతోందట. ఈ షెడ్యూల్ లో శ్రుతిహాసన్ కూడా పాల్గొననుంది. లాక్ డౌన్ సమయంలో గ్యాప్ రావడంతో.. పవన్ కాస్త ఒళ్లు చేశాడు. అందుకే.. ఇప్పుడు బరువు తగ్గి, `వకీల్ సాబ్` లుక్ లోకి మారే ప్రయత్నాల్లో ఉన్నాడు పవన్.