ఎన్టీఆర్ – రామ్ చరణ్ కథానాయకులుగా తెరకెక్కుతున్న క్రేజీ మల్టీస్టారర్ `ఆర్.ఆర్.ఆర్`. లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన ఈ సినిమా కొత్త షెడ్యూల్ సోమవారమే మొదలైంది. ఇప్పుడు ఈ సినిమా నుంచి అసలైన ట్రీట్ రాబోతోంది. చరణ్పుట్టిన రోజున… అల్లూరి టీజర్ ని విడుదల చేసింది చిత్రబృందం. ఎన్టీఆర్ పుట్టిన రోజున `భీమ్` టీజర్ రావాల్సింది. కానీ లాక్ డౌన్ కాలం కదా. కుదర్లేదు. ఇప్పుడు ఆ కానుక రాబోతోంది. అక్టోబరు 22న ఎన్టీఆర్ టీజర్ ని విడుదల చేయబోతోంది చిత్రబృందం. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసిందిప్పుడు.
రాజమౌళి ఏం చేసినా భారీగా, వినూత్నంగా ఉంటుంది. షూటింగ్ మళ్లీ మొదలైందని చెప్పడానికి.. ఓ చిన్న టీజర్ ని విడుదల చేశారు. గేట్లు తీయడం, కాస్ట్యూమ్స్ దుమ్ము దులపడం, ఆయుధాల్ని రెడీ చేయడం దగ్గర్నుంచి మొలలెడితే గుర్రంపైచరణ్, బుల్లెట్ పై ఎన్టీఆర్ వచ్చేంత వరకూ – షూటింగ్ ప్రాసెస్ మొత్తం కళ్లకు కడుతూ ఓ వీడియోని విడుదల చేశారు. దానికి తోడు కీరవాణి.. ఆర్.ఆర్ తోడై – ఇదే ఓ సినిమా టీజర్ ని తలపించింది. అక్టోబరు 22న ఈ హంగామా ఇంకా ఏ రేంజులో ఉంటుందో..?