దాసరి నారాయణరావు శిష్యుల్లో చాలామంది ఇప్పుడు టాప్ పొజీషన్లో ఉన్నారు. ఆయన దగ్గర ప్రత్యక్షంగా శిక్షరికం చేయాల్సిన పనిలేదు. ఆయన సినిమాలు చూసి ఎదిగిన వాళ్లు ఎందరో. మారుతి కూడా అంతే. దాసరి ఏక లవ్య శిష్యుల్లో మారుతి కూడా ఉంటాడు. నిజానికి మారుతి పూర్తి పేరు దాసరి మారుతి. ఓరకంగా… `దాసరి`కి ఈ రకంగానూ దగ్గరే. అయితే తెరపై దాసరి మారుతి అనే పేరు ఎప్పుడూ వేసుకోలేదు మారుతి. కారణం అడిగితే – `ఇండ్రస్ట్రీలో దాసరి అంటే ఒక్కరే. అది ఆయనే` అంటాడు దాసరి.
ఆ అభిమానంతోనే దాసరి నారాయణరావు బయోపిక్ తీస్తానంటున్నాడు. “దాసరి గారంటే నాకు చాలా అభిమానం. ఆయన బయోపిక్ నేనే తీస్తా. ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా సరే, బయోపిక్ తెరపైకి తీసుకెళ్తా. అందుకు దాసరి ఆశీర్వాదాలు కావాలి“ అంటున్నాడు మారుతి. దాసరి బయోపిక్ ఎలా తీయాలి, ఎవరితో తీయాలి? అనే విషయాలపై మారుతి ఇప్పటికే ఓ అవగాహనకు వచ్చినట్టు సమాచారం. అయితే… ఇప్పటికిప్పుడు ఈ బయోపిక్ తెరపైకి వెళ్లకపోవొచ్చు. కనీసం 2 ఏళ్లయినా సమయం పడుతుంది.