`ఓం నమో వేంకటేశ` తరవాత సినిమా ఏదీ పట్టాలెక్కించలేదు రాఘవేంద్రరావు. లాక్ డౌన్కి ముందు ఓ ప్రాజెక్టు అనుకున్నారు. కానీ… ఆగిపోయింది. ఇప్పుడు ఆ ప్రాజెక్టే పట్టాలెక్కించబోతున్నారు. రాఘవేంద్రరావు దర్శకుడిగా తెరకెక్కే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన రేపు ఉదయం రాబోతోంది. నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాల్ని తెలియజేయనున్నారు. స్టార్లెవరూ ఈ సినిమాలో ఉండకపోవొచ్చు. దాదాపు అంతా కొత్తవారితో ఈ సినిమా పట్టాలెక్కే ఛాన్సుంది. స్క్రిప్టు ఇప్పటికే సిద్ధమైపోయింది. `పెళ్లి సందడి` టైపులో చిన్న సినిమా ఇది. ఎప్పటిలానే సంగీతానికి ప్రాధాన్యం ఇవ్వబోతున్నారు. రాఘవేంద్రరావు నిర్మాణ, దర్శకత్వ సారధ్యంలో ఓ సినిమా కూడా మొదలవ్వబోతోంది. నాలుగు గొలుసు కథల సమాహారం ఈ సినిమా. దానికి సంబంధించిన డీటైల్స్ కూడా త్వరలో చెప్పే అవకాశం వుంది.