ఈరోజు రాజమౌళి పుట్టిన రోజు. సాధారణంగా స్టార్ దర్శకుల పుట్టిన రోజు వస్తుంటే… వాళ్ల సినిమాలకు సంబంధించిన టీజరో, ట్రైలరో వస్తుంది. `ఆర్.ఆర్.ఆర్` నుంచి మనం ఎలాంటి గిఫ్టులూ ఆశించలేం. ఎలాగూ.. ఎన్టీఆర్ టీజర్ వస్తోంది కదా. కనీసం చిత్రబృందం అయినా విష్ చేయాలి కదా. `ఆర్.ఆర్.ఆర్` టీమ్‌లోని కీలక సభ్యులు రాజమౌళికి అలానే ఓ వీడియో రూపంలో శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఎప్పటిలా… `ఆహా.. ఓహో రాజమౌళి` అనకుండా కంప్లైంట్లు గుప్పించారు. రాజమౌళి తమని ఎలా చిత్ర హింసలు పెడతాడో.. ఒకొక్కరూ ఒక్కో రీతిలో వర్ణించారు. ఎన్టీఆర్, చరణ్, కీరవాణి, సింథిల్.. ఇలా చిత్రబృందం అంతా.. రాజమౌళి తమని హింసించే విధానం గురించి ఏకరువు పెడుతూ ఈ వీడియో విడుదల చేయడం విశేషం.
ఓ పాట పల్లవిని జనవరిలో, చరణాన్ని జులైలో, మిక్సింగ్ ని డిసెంబరులో, రికార్డింగ్ ని వచ్చే యేడాది జనవరిలో చేయిస్తాడు కాబట్టి పాటపై ఇంట్రస్ట్ పోతోందని కీరవాణి ఆవేదన వ్యక్తం చేశారు ఈ వీడియోలో.
రిస్కీ షాట్లు ఎలా చేయిస్తాడో.. రామ్ చరణ్.. ఫన్నీ గా వివరించాడు
ఓ షాట్ తీయడానికి ఎన్ని గంటలు తీసుకుంటాడో… ఆ బాధ ఎలాంటిదో ఎన్టీఆర్ వర్ణించాడు.
ఇక అసిస్టెంట్ డైరెక్టర్ల బాధైతే వర్ణనాతీతం. ఇవన్నీ ఈ వీడియోలో చూసి తెలుసుకోవాల్సిందే.
దర్శకేంద్రుడ్ని ధీరుడు, వీరుడూ అని పొగడకుండా, పుట్టిన రోజు ఫిర్యాదుల చిట్టా విప్పడం.. అసలైన వెరైటీ.