రాజధానిపై అధికార,ప్రతిపక్షపార్టీలు ఎన్నికలకు వెళ్తే మంచిదేనని స్పీకర్ తమ్మినేని సీతారాం సలహా ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ చాలా రోజులుగా… రాజధానిపై ప్రజాభిప్రాయసేకరణ డిమాండ్ చేస్తోంది. ఎన్నికలకు ముందు అమరావతినే రాజధానిగా అంగీకరించారని.. ఇప్పుడు ప్రజల్ని మోసం చేసి… మూడు రాజధానులు అంటున్నరాని ప్రజాభిప్రాయం తీసుకోవాలని..ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేస్తూ వస్తోంది. ప్రతిపక్ష నేత చంద్రబాబు..రెండు విడుతలుగా సవాళ్లు కూడా చేశారు. అయితే రాజీనామాలు చేసే ప్రశ్నే లేదని కావాలంటే టీడీపీ నేతలు రాజీనామాలు చేయవచ్చని…వైసీపీ నేతలు సలహా ఇచ్చి సరి పెట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో అనూహ్యంగా స్పీకర్ నోటి వెంట..ఎన్నికల మాట రావడం రాజకీయవర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
అదే సమయంలో స్పీకర్ తమ్మినేని సీతారాం మీడియా ముందు మాట్లాడితే…ఆ స్పీకింగ్ చాలా ఘాటుగా ఉంటుంది. గతంలో సంగతేమో కానీ..స్పీకర్ అయిన తర్వాత అదే పరిస్థితి. చంద్రబాబు గుడ్డలిప్పదీస్తాం అన్న దగ్గర్నుంచి న్యాయవ్యవస్థపై అనుచిత వ్యాఖ్యల వరకూ చాలా చాలా వ్యాఖ్యలు చేశారు. అయితే అనూహ్యంగా ఇప్పుడు ఆయన వాయిస్‌లో బేస్ మారిపోయింది. ఆయన చాలా స్మూత్‌గా మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితిచాలా ఆరోగ్య కరంగా ఉందని కూడా చెప్పుకొచ్చారు. అధికార, ప్రతిపక్షాల సవాళ్లు ప్రజాస్వామ్య పరంగా ఉన్నాయంటున్నారు. నిన్నటి వరకూ స్పీకర్ ..తాను అసెంబ్లీలో మాత్రమే స్పీకర్‌నని..బయట వైసీపీ నేతనన్నట్లుగా ప్రతిపక్షపార్టీని దారుణంగా విమర్శించేవారు. ఇప్పుడు ఆరోగ్యకరమైన రాజకీయాలు చేస్తున్నారని సర్టిఫికెట్ ఇస్తున్నారు.
తమ్మినేని సీతారంలో ఈ మార్పు రావడానికి కారణం ..హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించడమేనని వైసీపీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. న్యాయవ్యవస్థపై తమ్మినేని సీతారాం చేసిన వ్యాఖ్యలను హైకోర్టు సీరియస్‌గా తీసుకుంది. సభలో కాకుండా ఆ వ్యాఖ్యలు బయట చేసినందున.. తమ్మినేని పై కోర్టుధిక్కార చర్యలు తీసుకోవచ్చని తేల్చేసింది. ఇప్పుడు ఆ వ్యాఖ్యల వెనుక కుట్రఉందన్న అభిప్రాయంతో సీబీఐ విచారణకు ఆదేశించారు. సీబీఐ విచారణ ప్రారంభమైన స్పీకర్‌పై కూడా కేసులు పెట్టాల్సిన పరిస్థితి రావచ్చన్న విశ్లేషణలున్నాయి. ఈ తరుణంలో తమ్మినేని వాయిస్ సాఫ్ట్‌గా మారిపోయింది.