`ఆర్.ఆర్.ఆర్` ఓ భారీ పాన్ ఇండియా ప్రాజెక్టు. దీని తరవాత… ఏ సినిమా చేయాలి, ఎలాంటి కథలు ఎంచుకోవాలి? అనే విషయంపై ఎన్టీఆర్ ఓ క్లారిటీకి వచ్చేశాడు. రామ్ చరణ్ మాత్రమే డైలామాలో ఉన్నాడు. చరణ్ తదుపరి సినిమా ఏమిటన్న విషయంలో ఇంకా స్పష్టత లేదు. కాకపోతే…కథలు మాత్రం వింటున్నాడు. ఈసారి కూడా పాన్ ఇండియా సినిమా చేయాలన్నదే చరణ్ లక్ష్యం. అందులో భాగంగా ఓ కథని లాక్ చేసినట్టు టాలీవుడ్ సమాచారం.
తమిళ దర్శకుడు మోహన్ రాజా ఇటీవల చరణ్‌కి ఓ కథ చెప్పినట్టు, చరణ్‌కి ఆ కథ నచ్చినట్టు సమాచారం. మోహన్ రాజా ఎవరో కాదు, ఎడిటర్ మోహన్ తనయుడు. `ధృవ` ఒరిజినల్ వెర్షన్ `తనిఒరువన్` డైరెక్టర్. ఇప్పుడు తమిళంలో `తనిఒరువన్ 2` తెరకెక్కుతోంది. ఆ సినిమాని సైతం తెలుగులో చరణ్ రీమేక్ చేసే అవకాశాలున్నాయని చెప్పుకుంటున్నారు. ఈ దశలోనే… మోహన్ రాజా, చరణ్‌ల మధ్య భేటీ కుదిరిందని, తనిఒరువన్ 2 కథతో పాటు…చరణ్‌కి మోహన్ రాజా మరో కథ వినిపించాడని, అది చరణ్‌కి నచ్చిందని టాక్. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించే అవకాశం ఉండడంతో చరణ్ ఈ కథని హోల్ట్ చేశాడని చెప్పుకుంటున్నారు.