చిత్రసీమ మళ్లీ షూటింగులతో కళకళలాడుతోంది. స్టార్ హీరోలంతా ఒకొక్కరుగా సెట్స్‌పైకి వస్తున్నారు. త్వరలోనే పవన్‌కల్యాణ్ సైతం షూటింగులతో బిజీ కానున్నారు. ఆయన కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం `వకీల్ సాబ్`. లాక్ డౌన్‌కి ముందు 70 శాతం షూటింగ్ పూర్తయ్యింది. ఇప్పుడు మళ్లీ షూటింగులకు సమాయాత్తం అవుతోంది. దసరా తరవాత `వకీల్ సాబ్` కొత్త షెడ్యూల్ హైదరాబాద్ లో మొదలు కాబోతోంది. ఈ షెడ్యూల్ లో పవన్, శ్రుతిపై కీలకమైన సన్నివేశాలతో పాటు ఓ పాటని తెరకెక్కించనున్నారు. ఈ షెడ్యూల్ తోనే షూటింగ్ మొత్తం పూర్తి కాబోతోంది. ఇందుకోసం ఆర్.ఎఫ్.సీ లో ఓ సెట్ ని ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. సంక్రాంతికి `వకీల్ సాబ్`ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. అంజలి, నివేదా థామస్ కీలకమైన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వాళ్లకు సంబంధించిన సన్నివేశాలన్నీ ఇటీవలే పూర్తి చేసేశారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఓ పాట బయటకు వచ్చింది. ఇది కాకుండా మరో నాలుగు పాటలు కూడా ఆల్బమ్ లో ఉండబోతున్నాయి. అయితే సినిమాలో మాత్రం మూడే పాటులంటాయని టాక్.