`ఆచార్య` తరవాత ఏ సినిమా చేయాలన్న విషయంలో చిరంజీవి పూర్తి క్లారిటీతో ఉన్నాడు. `ఆచార్య` తరవాత `వేదాళం` రీమేక్ నే పట్టాలెక్కబోతోంది. మెహర్ రమేష్ పూర్తి స్క్రిప్టుతో సిద్ధంగా ఉండడంతో – చిరు కి కూడా ఫుల్ క్లారిటీ వచ్చేసింది. ఓవైపు.. నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల ఎంపిక ప్రక్రియ జోరుగా సాగుతోంది. చిరు చెల్లాయిగా సాయిపల్లవి నటిస్తుందని ప్రచారం జరిగింది. సాయి పల్లవి అయితే ఈ పాత్రకు బాగుంటుందని చిరు, మెహర్ రమేష్ భావిస్తున్నారు. అయితే ఇప్పుడు మరో ఆప్షన్ కూడా చేతిలో ఉంది. తనే కీర్తి సురేష్. ఈ సినిమాలో నటించడానికి కీర్తి కూడా ఉత్సాహం చూపిస్తోందని తెలుస్తోంది. సాయి పల్లవి, కీర్తి సురేష్లలో బెటర్ ఆప్షన్ ఏది అనే విషయంలో చిత్రబృందం తర్జన భర్జనలు పడుతోంది. ఎవరైనా ఓకే. కాకపోతే.. కాల్షీట్ల సర్దుబాటు చూసుకోవాల్సివుంటుంది. చిరంజీవి ప్రస్తుతం హైదరాబాద్ లో లేరు. ఆయన రాగానే… మెహర్ రమేష్ తో ఓ మీటింగ్ ఉండబోతోంది. ఆ తరవాతే.. చిరు చెల్లాయిగా ఎవరన్నది తేలుతుంది. ఈ ఇద్దరిలో ఎవరొచ్చినా… బాగానే ఉంటుంది మరి.