అన్నపూర్ణ స్టూడియోలో ఈరోజు ఉదయం అగ్ని ప్రమాదం సంభవించిందని వార్తలొచ్చాయి. అందుకు సంబంధించిన కొన్ని ఫొటోలూ బయటకు వచ్చాయి. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం సంభవించిందని, పెద్దగా ఆస్తి నష్టం జరగలేదని తెలిసింది. అయితే ఈ ప్రమాదంపై ఇప్పుడు నాగార్జున స్పందించారు. పొద్దుట నుంచి స్టూడియోలో అగ్ని ప్రమాదంపై వార్తలు వస్తున్నాయని, అలాంటిదేం జరగలేదని, అంతా బాగానే వుందని, అది ఓ తప్పుడు వార్త అని క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు నాగ్ ఓ ట్వీట్ చేశారు.
అన్నపూర్ణ స్టూడియోలో అగ్ని ప్రమాదం జరిగిందన్నది నిజం. అది చిన్నదా, పెద్దదా? దాని వల్ల నష్టం ఎంత ? అనేది పక్కన పెడితే… స్టూడియోలో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయి. దాన్ని గుర్తించిన సిబ్బంది.. సకాలంలో స్పందించి ఆర్పేశారు కూడా. అయితే ఈ ఇష్యూని నాగ్ పెద్దది చేయదలచుకోలేదు. అందుకే ఇలా స్పందించాల్సివచ్చిందని తెలుస్తోంది. అగ్ని ప్రమాదంలో పెద్దగా నష్టం వాటిల్లలేదని, అలాంటప్పుడు ఇలాంటి ప్రచారం వల్ల స్టూడియో రెప్యుటేషన్పై ప్రభావం పడుతుందని నాగ్ భావిస్తున్నారు. అందుకే ఇలా ట్వీట్ తో స్పందించారేమో..?
There are some articles in the media that there has been a major fire At Annapurna Studios this morning… Not to worry this is WRONG NEWS and everything is absolutely fine??
— Nagarjuna Akkineni (@iamnagarjuna) October 16, 2020