వైసీపీలో రెబల్‌గా మారిన ఎంపీ రఘురామకృష్ణరాజుకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా షాక్ ఇచ్చారు. వైసీపీ అధినేత జగన్ విజ్ఞప్తి మేరకు..లోక్‌సభ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ సబార్డినేట్ లెజిస్లేచర్ కి చైర్మన్ పదవి నుంచి రఘురామకృష్ణరాజును తొలగించి వల్లభనేని బాలశౌరికి పదవి ఇప్పగించారు. తనకు పదవిని జగన్ ఇవ్వలేదని.. నరేంద్రమోదీ ఇప్పించారని.. కాబట్టి.. తన పదవికి ఏమీ ఢోకా లేదని.. రఘురామకృష్ణరాజు చెబుతూ వచ్చారు. కానీ అనూహ్యంగా…పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ పదవి పోయింది. ఇప్పటికే మార్పులు అమల్లోకి వచ్చాయని లోక్‌సభ స్పీకర్ కార్యాలయం కూడా ప్రకటించింది.
రఘురామకృష్ణరాజును తొలగించి బాలశౌరికి పదవి ఇవ్వాలని వైసీపీ చాలా కాలంగా ఢిల్లీలో లాబీయింగ్ చేస్తోంది. ప్రత్యేక విమానంలో రఘురామకృష్ణరాజుపై ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీ వెళ్లిన ఎంపీలు.. ఆయనపై అనర్హతా వేటు వేయమని విజ్ఞాపనా పత్రం ఇచ్చారు. ఒక వేళ ఆలస్యం అయితే .. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ పదవి నుంచి అయినా తొలగించాలని కోరారు. ఇప్పటికి.. సమయం రావడంతో..కొన్ని మార్పులు చేయాల్సిన పరిస్థితి రావడంతో … ఓం బిర్లా..వైసీపీ విజ్ఞప్తిని పరిశీలించి..రఘురామకృష్ణరాజు పదవి నుంచి తప్పించినట్లుగా తెలుస్తోంది.
పార్లమెంటు నియమాలు, నిబంధనలు, సబ్-రూల్స్, బై లాస్ తదితర అంశాలను పరిశీలించి సభకు నివేదించడం మొదలైనవి ఈ కమిటీ విధి. రాజ్యాంగం లేదా పార్లమెంటు ప్రతిపాదించిన ప్రతినిధుల పరిధిలోని పనులు అమలు సక్రమంగా జరుగుతున్నాయో లేదా పరిశీలిస్తుంది. మొత్తానికి తన పదవి పోదని నమ్మకంగా ఉన్న రఘురామకృష్ణరాజుకు …ఆ నమ్మకం లేకుండా పోయింది. పదవి పోయింది.