మహేష్ బాబు – పరశురామ్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం `సర్కారు వారి పాట`. ఈ సినిమాలో కథానాయికగా కీర్తి సురేష్ పేరు ప్రచారంలో ఉంది. కానీ చిత్రబృందం ఇప్పటి వరకూ అధికారికంగా ప్రకటించలేదు. అయితే… మహేష్ ఆ లాంఛనాన్ని పూర్తి చేశాడు. ఈ రోజు కీర్తి సురేష్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా మహేష్ ఓ ట్వీట్ చేశాడు. ఈ ప్రాజెక్టులోకి కీర్తి సురేష్‌కి స్వాగతం పలికాడు. దాంతో.. `సర్కారు వారి పాట`లో కీర్తి పేరు ఖాయమైనట్టు అయ్యింది. ప్రతినాయకుడిగా చాలామంది పేర్లు వినిపిస్తున్నాయి. అరవింద్ స్వామి పేరు ఖరారు చేసే అవకాశాలున్నాయి. ఆ బెర్తు కూడా ఖాయమైపోతే… ఓ పని అయిపోయినట్టే. వచ్చే నెలలో హైదరాబాద్ లో షూటింగ్ మొదలయ్యే అవకాశాలున్నాయని టాక్. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఇటీవల తమన్ మ్యూజిక్ సిట్టింగ్ కూడా మొదలైపోయింది. మొత్తానికి `సర్కారు వారి పాట` యాక్టీవ్ మోడ్‌లోకి వచ్చేసినట్టైంది.