లాక్ డౌన్ కు ముందు ఆగిపోయిన `క్రాక్` సినిమాని ఈమధ్యే మొదలెట్టాడు రవితేజ. ఆ సినిమాని చక చక పూర్తి చేస్తున్నాడు. ఇప్పుడు మరో సినిమానీ పట్టాలెక్కించేస్తున్నాడు. రవితేజ – రమేష్ వర్మ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతోందన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు దాన్నీ పట్టాలెక్కించేస్తున్నాడు. ఆదివారం ఉదయం 11 గంటల 55 నిమిషాలకు ఈ సినిమాకి క్లాప్ కొట్టనున్నారు. అంతేకాదు… ఈ సినిమాలో రవితేజ లుక్‌నీ రివీల్ చేయబోతున్నారు.
ఈ సినిమాకి `కిలాడీ` అనే పేరు పరిశీలిస్తున్నారు. ఓ తమిళ సినిమాకి ఇది రీమేక్ అని ప్రచారం జరుగుతోంది. అయితే.. ఇది పూర్తిగా కొత్త కథ అని చిత్రబృందం చెబుతోంది. మీనాక్షీ చౌదరిని కథానాయికగా ఎంచుకున్నారు. సత్యనారాయణ కోనేరు నిర్మాత. మారుతి దర్శకత్వంలో రవితేజ కథానాయకుడిగా ఓ సినిమా ఉండబోతోంది. డిసెంబరు లేదా జనవరిలో ఈ సినిమా పట్టాలెక్కుతుంది. త్వరలోనే ఓ అధికారిక ప్రకటన రాబోతోంది.