కరోనా మహమ్మారి ఎవ్వరినీ వదలడం లేదు. కాస్త అప్రమత్తంగా ఉన్నా సరే, కబళించేస్తోంది. ఇప్పుడు రాజశేఖర్ ఇంటి సభ్యులకు కరోనా సోకింది. రాజశేఖర్, జీవితలతో పాటు, ఇద్దరు కుమార్తెలకు కరోనా సోకినట్టు రాజశేఖర్ స్వయంగా నిర్దారించారు. ప్రస్తుతం హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శివానీ, శివాత్మికలకు ప్రస్తుతం ఆరోగ్యం బాగానే ఉందని సమాచారం. జీవిత, రాజశేఖర్ మెల్లమెల్లగా కోలుకుంటున్నారు. ఈ విషయాన్ని రాజశేఖర్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నామని, త్వరలోనే కోలుకుంటామన్న నమ్మకం ఉందని రాజశేఖర్ తెలిపారు.