`నర్తన శాల` పేరుతో నందమూరి బాలకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా మొదలై ఆగిపోయిన సంగతి తెలిసిందే. ద్రౌపతిగా సౌందర్య నటించిన చిత్రమిది. కొంత మేర షూటింగ్ జరుపుకున్నాక, కొన్ని అవాంతరాలు ఎదురయ్యాయి. సౌందర్య ఆకాల మరణం కూడా ఈ సినిమా ఆగిపోవడానికి ఓ కారణమైంది. ఇంతకాలానికి ఈ సినిమా విడుదల అవుతోంది. సినిమా మొత్తం కాదు. అందులోని 17 నిమిషాలు. షూటింగ్ జరుపుకున్న కొంత భాగాన్ని ఎడిట్ చేసి, రీ రికార్డింగ్ జరిపి, డబ్బింగులు చెప్పి ఈ 17 నిమిషాల ఎపిసోడ్ ని `శ్రేయాస్` ఓటీటీ ద్వారా విడుదల చేస్తున్నారు. నిజానికి బాలయ్య పుట్టిన రోజునే ఈ ఎపిసోడ్ ని రిలీజ్ చేద్దాం అనుకున్నారు. కానీ.. ఇప్పటికి ఆ పనులు పూర్తయ్యాయి. ఈనెల 24న శ్రేయాస్ లో `నర్తన శాల` చూడొచ్చు. అయితే.. దానికి టికెట్ కొనుగోలు చేయాల్సివుంటుంది. దీని ద్వారా వచ్చే ఆదాయాన్ని బాలకృష్ణ సామాజిక సేవ కోసం ఉపయోగించబోతున్నారు. అప్పటి నర్తన శాల ఎలా వుంది? బాలయ్య దర్శకత్వ ప్రతిభేంటి? అనేది తెలియాలంటే `నర్తనశాల` చూడాల్సిందే.