సభ్య సమాజం మరోసారి తలదించుకోవాల్సిన దుస్థితి ఇది. మొన్నటికి మొన్న ఐపీఎల్ లో ధోనీ విఫలం అయితే.. ధోనీ కుమార్తెని అత్యాచారం చేస్తానని బెదిరించి – దిగజారిపోతున్న విలువలకు తర్పణంగా నిలిచాడో దుర్మార్గుడు. ఇప్పుడు విజయ్ సేతుపతికీ అలాంటి చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి. విజయ్‌సేతుపతి కూతున్ని మానభంగం చేస్తానని ఓ ప్రబుద్ధుడు సోషల్ మీడియాలో బెదిరింపులకు దిగాడు.
`800` సినిమాలో విజయ్ సేతుపతి నటించడమే ఇలాంటి బెదిరింపులకు కారణం. ఈ సినిమాలో నటించొద్దని తమిళ సంఘాలు విజయ్ పై ఒత్తిడి తీసుకొచ్చిన దరిమిలా.. విజయ్ ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు. అయినా సరే, కొంతమంది ప్రబుద్ధుల మనసులు శాంతించలేదు. విజయ్‌పై పరోక్ష దాడులకు దిగుతున్నారు. ఇలాంటి అత్యాచార బెదిరింపులు ఓ తండ్రిగా విజయ్ ని ఎంత మానసిక క్షోభకు గురి చేస్తాయో..?
నెటిజన్లు కూడా ఇలాంటి ట్వీట్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గాయని చిన్మయి ధీటుగా స్పందించింది. ‘ఇలాంటి నీచమైన వ్యక్తులే సమాజంలో లైంగిక నేరాలకు మద్దతు పలుకుతారు, దీనిని ఎవరూ మార్చలేరు?. అమ్మాయిలను బహిరంగంగా అత్యాచారం చేస్తానని చెప్తున్న వ్యక్తి నేరస్థుడు. ఇంత జరుగుతున్న చూస్తూ ఊరుకుంటున్నారంటే సిగ్గుచేటు’ అంటూ ఫైర్ అయ్యింది. ఇలాంటి ట్వీట్లకు పాల్పడున్నవాళ్లని కఠినంగా శిక్షించాల్సిందే. ఇది అత్యాచారినికి ఏమాత్రం తీసిపోని నేరంగా పరిగణించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.